Anganwadi staff : అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం- ఈనెల 5 లోపు విధుల్లో చేరకుంటే చర్యలు తప్పవని వార్నింగ్
Anganwadi staff : తక్షణమే విధుల్లో చేరాలని అంగన్‌వాడీ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. లేకుంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
Andhra Pradesh News: ఏపీలో 21 రోజులకుపైగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలకు(Anganwadi Staff) ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీ లోపు విధులకు హాజరుకాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో చేరకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. విధులకు హాజరుకాని వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని కిందిస్థాయి అధికారులకు సూచనలు చేసింది.
విధులకు హాజరుకానీ అంగన్‌వాడీల వివరాలు సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంపై అంగన్‌వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జీతాలు పెంచాలంటూ గత 22 రోజులుగా అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే అంగన్‌వాడీలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపగా విఫలం అయ్యాయి. సర్కారు తమ డిమాండ్లు నెరవర్చలేదని అంగన్వాడీలు మళ్లీ సమ్మె బాటపట్టారు. దీంతో రాష్ట్రంలోని బాలింతలు, గర్బిణీలు, శిశువులు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో విధులకు హాజరుకావాలని ప్రభుత్వం మంగళవారం అల్టిమేటం జారీ చేసింది. జనవరి 5వ తేదీలోపు విధులకు హాజరుకావాలని సూచించింది. విధులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.