Wrestlers Protest: బేటీ బచావో అంతా ఓ బూటకం - మహిళా రెజ్లర్ల ఆందోళనలకు రాహుల్ సపోర్ట్
Wrestlers Protest: ఆందోళనలు చేస్తున్న మహిళా రెజ్లర్లకు రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు.
Wrestlers Protest:
ట్వీట్ చేసిన రాహుల్
రెజ్లర్ల ఆందోళనలపై రాహుల్ గాంధీ స్పందించారు. అర్ధరాత్రి పోలీసులు వాళ్లపై దాడి చేయడాన్ని ఖండించారు. మహిళా రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్నా బీజేపీ నోరు మెదపడం లేదని మండి పడ్డారు. ఇది నిజంగా సిగ్గుచేటు అంటూ ట్వీట్ చేశారు. బేటీ బచావో అనేది కేవలం ఓ బూటకం అని విమర్శించారు. అర్ధరాత్రి జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఉన్నట్టుండి వచ్చి బారికేడ్‌లు పెట్టారు. అక్కడికి ఎవరినీ అనుమతించకుండా ఆంక్షలు విధించారు. దీంతో రెజ్లర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు రెజ్లర్లు గాయపడ్డారు. దీనిపై ఇప్పటికే వినేష్ ఫోగట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి పతకాలు సాధించి పెట్టిన తమకు ఈ గతి పట్టిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వీరికి ఆప్ సహా కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
"మహిళా రెజ్లర్లతో వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. బేటీ బచావో అనేది కేవలం ఓ బూటకం అని అర్థమైపోయింది. దేశంలోని మహిళలపై దాడులు జరుగుతున్నా బీజేపీ స్పందించడం లేదు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
देश के खिलाड़ियों के साथ ऐसा बर्ताव बहुत ही शर्मनाक है।
— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2023
‘बेटी बचाओ' बस ढोंग है! असल में भाजपा भारत की बेटियों पर अत्याचार करने से कभी पीछे नहीं हटी है। pic.twitter.com/TRgPyM8UbF
కన్నీళ్లు పెట్టుకున్న వినేష్ ఫోగట్..
రెజ్లర్లు నిరసనలు చేస్తున్న జంతర్‌మంతర్ వద్దకు అర్ధరాత్రి పోలీసులు రావడం ఘర్షణకు దారి తీసింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. తమపై పోలీసులు దాడి చేశారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ గొడవ తరవాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు వినేష్ ఫోగట్. లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు తమపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న తమ పట్ల ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. "ఇది చూడడానికేనా మేం దేశం కోసం పతకాలు తీసుకొచ్చింది" అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అంతే కాదు. కొందరు పోలీసులు మద్యం మత్తులో వచ్చి తమపై దాడి చేశారని ఆరోపించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ... ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నరెజ్లర్లకు పోలీసుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది.
Also Read: Army Helicopter Crash: కుప్ప కూలిన ఆర్మీ చాపర్, ఇద్దరు పైలట్లకు తృటిలో తప్పిన ప్రమాదం