Army Helicopter Crash: కుప్ప కూలిన ఆర్మీ చాపర్, ఇద్దరు పైలట్లకు తృటిలో తప్పిన ప్రమాదం
Army Helicopter Crash: జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ చాపర్ కుప్ప కూలింది.
Army Helicopter Crash:
జమ్ముకశ్మీర్‌లో ప్రమాదం..
జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వర్ జిల్లాలో ఆర్మీ చాపర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో చాపర్‌లో ఇద్దరు పైలట్లు ఉన్నారు. అదృష్టవశాత్తూ వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ALH Dhruv హెలికాప్టర్ మర్వా ప్రాంతంలో కుప్ప కూలినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు మార్చి నెలలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ALH Dhruv Mark 3 హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో కుప్ప కూలింది. చాపర్‌ను టెస్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది జరిగిన సమయంలో చాపర్‌లో ముగ్గురు ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే...ఇప్పుడు కశ్మీర్లో జరిగిన ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Indian Army chopper crashes in J-K's Kishtwar
— ANI Digital (@ani_digital) May 4, 2023
Read @ANI Story | https://t.co/BcO6f51ra8#Armychoppercrash #JammuKashmir pic.twitter.com/jWu2kxwLY2
An Army ALH Dhruv Helicopter crashed near Kishtwar, Jammu & Kashmir. Pilots have suffered injuries but are safe. Further details awaited: Army Officials. pic.twitter.com/ya41m7CRfn
— ANI (@ANI) May 4, 2023
కేరళలో..
గత నెల ఇండియన్ నేవీ చాపర్ ప్రమాదానికి గురైంది. ముంబయి కోస్ట్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో Advanced Light Helicopter (ALH) లో ముగ్గురు ఉన్నారు. నేవల్ పాట్రోల్ క్రాఫ్ట్ అప్రమత్తమై సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ముగ్గురు బాధితులనూ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో విచారించాలని భారత నేవీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉన్నట్టుండి పవర్ ఆఫ్ అవడంతో పాటు కిందకు జారిపోయిందని, ఫలితంగా పైలట్ కంట్రోల్ కోల్పోయాడని ఇండియన్ నేవీ ప్రాథమికంగా తెలిపింది. ప్రమాదానికి గురైన ALH-DHRUV ను దేశీయంగా తయారు చేశారు. ఇందులో రెండు ఇంజిన్లుంటాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దీన్ని రూపొందించింది. 1984లో వీటి తయారీ మొదలు పెట్టింది. జర్మనీ సహకారంతో డిజైన్ చేసింది. 1992లో తొలిసారి గాల్లోకి ఎగిరిన ఈ హెలికాప్టర్...2002లో అధికారికంగా నేవీలో చేరింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో
గతేడాది అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ సైనిక హెలికాప్టర్ క్రాష్ అయింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగింగ్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రోడ్డు మార్గం లేదని, రెస్క్యూ టీమ్‌ను వెంటనే పంపినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఇటీవల హెలికాప్టర్ కూలిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. గతేడాది అక్టోబర్ 18న ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. ఫాటా నుంచి కేదార్నాథ్ యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.