Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని పుతిన్ ఆపేస్తారట, కానీ కండీషన్స్ అప్లై
Russia-Ukraine War: కలిసి కూర్చుని సయోధ్య కుదిర్చితే ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపడానికి సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు పుతిన్.
Russia-Ukraine War:
సెటిల్ చేసుకుంటే ఓకే..
ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. "ఈ మిలిటరీ ఆపరేషన్ ఎన్ని రోజులైనా కొనసాగుతుంది" అని చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ...ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. "కలిసి కూర్చుని సెటిల్ చేసుకుంటే యుద్ధం ముగిసిపోయే అవకాశముంది" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పుతిన్. "సెటిల్‌మెంట్ కాస్త కష్టమే అయినా...సమయం పట్టినా అదే ఈ ఉద్రిక్తతలకు స్వస్తి పలుకుతుంది. ఈ సయోధ్య కుదర్చటంలో ముందుకొచ్చిన వాళ్లెవరైనా సరే...క్షేత్రస్థాయిలో నిజానిజా లేంటన్నది మాత్రం తప్పకుండా పరిశీలించాలి" అని అన్నారు. అంటే...సయోధ్య కుదిర్చేందుకు ముందుకొస్తే అందుకు సిద్ధమే అన్న సంకేతాలిచ్చారు. కాకపోతే...ఆయన మాటల్ని బట్టి చూస్తే ఏదో ఓ కండీషన్ పెట్టి ఈ మ్యాటర్‌ను సెటిల్ చేసే అవకాముంది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పుతిన్ ఇలా అన్నారని The Guardian పత్రిక వెల్లడించింది. అయితే..ఇదే సమయంలో మరోసారి అణుహెచ్చరికలు చేశారు. "మాస్కోపై ముప్పేట దాడి చేయాలనుకుంటే రష్యన్ న్యూక్లియర్ శక్తి వాటిని తప్పకుండా అడ్డుకుంటుంది. అదే జరిగితే...శత్రు దేశానికి ఇంకేమీ మిగలదు" అని హెచ్చరించారు. నిజానికి...మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టిన కొద్ది వారాల్లోనే ఉక్రెయిన్ తమ హస్తగతం అవుతుందని రష్యా భావించింది. కానీ...ఉక్రెయిన్ బలగాలు అంత సులువుగా ఓటమిని ఒప్పుకోలేదు. గట్టిగా పోరాడుతూ వస్తున్నాయి. అందుకే... 10 నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనిపైనా పుతిన్ కామెంట్స్ చేశారు. "మా ప్లాన్ ప్రకారమే మిలిటరీ ఆపరేషన్ నడుస్తోంది. అక్కడ మాకెలాంటి ఇబ్బందులూ ఎదురవట్లేదు" అని స్పష్టం చేశారు. ప్రజలకు సమాచారమంతా పారదర్శకంగా అందిస్తున్నామని వెల్లడించారు. అంతకు ముందు "హీరోస్ ఆఫ్ రష్యా" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..మిలిటరీని ఉద్దేశించి మాట్లాడారు. ఉక్రెయిన్ మౌలిక వసతులపై రష్యా దాడి చేస్తోందన్న విమర్శలపై మండి పడ్డారు. రష్యాను, క్రిమియాను అనుసంధానించే వంతెనను ఉక్రెయిన్ కూల్చలేదా అని ప్రశ్నించారు. "అవును మేం దాడి చేస్తాం. కానీ...అసలు ఈ దాడులను ముందుగా ఎవరు మొదలు పెట్టారు..? మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది మీరు కాదా..?" అని మండి పడ్డారు.
అమెరికా ఫ్రాన్స్ ఫ్రంట్..
అమెరికా, ఫ్రాన్స్ సంయుక్తంగా ఓ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేయాలని పుతిన్‌తో మాట్లాడిఒప్పించేందుకు ఈ ఫ్రంట్ చొరవ చూపనుంది. యుద్ధాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలని, కీలక ప్రాంతాల నుంచి రష్యా బలగాలు వెనక్కి రావాలని పుతిన్‌ను కోరనున్నాయి ఈ ఇరు దేశాలు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మేక్రాన్ ఇప్పటికే పుతిన్‌పై చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ను వేధించి చంపుతున్నారని మండి పడ్డారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం పుతిన్‌తో చర్చలకు సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ఈ రెండు దేశాలు చొరవ చూపడానికి కారణం...రష్యా, ఉక్రెయిన్ నుంచి అత్యవసరాలు నిలిచి పోయాయి. క్రూడ్ ఆయిల్ సరఫరా కూడా బాగా తగ్గిపోయింది. బ్యారెల్ ధర 100డాలర్లకు చేరుకుంది. ఇక ఐరోపా దేశాలకు గ్యాస్ సప్లై కూడా అంతంతమాత్రంగానే ఉంది. అసలే శీతాకాలం. ఇప్పుడు గ్యాస్ అందకపోతే...ఐరోపా అంతా చలితో వణికిపోవాల్సిందే. అందుకే..బైడెన్, మేక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: South Koreans: సౌత్ కొరియన్ల వయసు తగ్గిపోతుందట, ఏమైనా మేజిక్ చేస్తున్నారా ఏంటి?