South Koreans: సౌత్ కొరియన్ల వయసు తగ్గిపోతుందట, ఏమైనా మేజిక్ చేస్తున్నారా ఏంటి?
South Koreans Age: సౌత్ కొరియాలో వయసుని గణించే పాత విధానాలను ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తోంది.
South Koreans Age:
వయసు తగ్గింతే కొత్త చట్టం..
వయసు పోతే మళ్లీ రాదు. ఏదైనా సాధించాలనుకుంటే ఇప్పుడే చేయ్. ఇలాంటి కొటేషన్లు వింటూనే ఉంటాం. కానీ...ఏజ్ పెరిగినా పర్లేదు. తగ్గించేస్తాం అంటోంది దక్షిణ కొరియా. అలా అని ఇంటర్‌స్టెల్లార్ సినిమాలో చూపించినట్టు స్పేస్‌లోకి ఏమీ తీసుకెళ్లడం లేదు. జస్ట్ ఆ దేశం ఇప్పటి వరకూ ఉన్న వయసు గణన విధానాన్ని మార్చేస్తోందంతే. సింపుల్‌గా చెప్పాలంటే...Age Counting Systemని మార్చేస్తోంది. ఈ మేరకు కొత్త చట్టం అమల్లోకి తీసుకురానుంది. ఇది అమల్లోకి వస్తే ప్రతి వ్యక్తి వయసు ఒకటి లేదా రెండేళ్లు తగ్గిపోతుంది. అలా వాళ్లు యంగ్‌గా మారిపోయినట్టే లెక్క. సౌత్ కొరియా ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్‌లో ఈ కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఇప్పటి వరకూ ఉన్న "Korean Age" విధానానికి స్వస్తి పలికింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇకపై పౌరుల వయసుని గణించనుంది.
కొరియన్ ఏజ్ అంటే ఏంటి..?
కొరియన్ ఏజ్ ప్రకారం...పుట్టిన వెంటనే వాళ్ల వయసుని "ఏడాది"గా పరిగణిస్తారు. అంటే...పుట్టిన వెంటనే వాళ్లకు ఓ సంవత్సరం నిండిపోయినట్టు లెక్క. ఆ తరవాత కొత్త సంవత్సరం మొదలవగానే...రెండేళ్లు పూర్తైనట్టు పరిగణిస్తారు. ఉదాహరణకు...డిసెంబర్ 31న ఓ శిశువు జన్మిస్తే...వయసుని ఏడాదిగా పరిగణిస్తారు. జనవరి 1న కొత్త ఏడాది ప్రారంభం కాగానే...ఆ వయసుని పెంచేసి రెండేళ్లుగా కన్సిడర్ చేస్తారు.
మరో విధానంలోనూ ఇలా వయసుని లెక్కిస్తారు. ఓ శిశువు జన్మించిన సమయంలో వయసుని "సున్నా" గా లెక్కిస్తారు. అయితే...కొత్త ఏడాది మొదలవగానే 12 నెలలు అనే లెక్కతో సంబంధం లేకుండా...ఆ శిశువు వయసు "ఏడాది"గా ఫిక్స్ అవుతారు. ఈ రెండు విధానాల్లోనూ కనిపించేది ఒకటే. కొత్త ఏడాదితో వాళ్ల వయసులు తారుమారైపోతాయి. ఈ విధానం వల్లే కొరియన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్మోకింగ్, డ్రింకింగ్‌కు సంబంధించిన "ఏజ్ ఫ్యాక్టర్"తోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఓ సర్వే చేపట్టింది. ప్రస్తుత వయసు గణన విధానంపై అభిప్రాయాలు సేకరించింది. దాదాపు 80% మంది ప్రజలు దీన్ని తీసేయాలనే కోరుకున్నారు.
ఎన్నికల హామీ..
గతేడాది ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ ఈ వయసు గణన విధానాన్ని మార్చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీ నిలబెట్టుకునే పనిలో పడ్డారు. దీని వల్ల అనవసరమైన చిక్కులు వచ్చి పడుతున్నాయని భావించిన ఆయన...పాత పద్ధతికి స్వస్తి చెప్పనున్నారు. 1960 ల నుంచి ఆసియా దేశాలన్నీ అంతర్జాతీయ విధానాన్నే అనుసరించి...వయసుని లెక్కిస్తున్నాయి. అంటే...బిడ్డ పుట్టినప్పుడు వయసుని సున్నాగా పరిగణించి..12 నెలలు గడిచాకే "ఏడాది" అని లెక్కిస్తున్నాయి. 2023 జూన్ నుంచి సౌత్ కొరియాలోనూ ఇదే విధానం అమలు కానుంది. అంతర్జాతీయంగా ఆమోదయోగ్యంగా ఉన్న పద్ధతిలోనే ప్రజల వయసుని లెక్కిస్తారు.
ఈ కారణంగానే...ఈ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే పౌరులందరి వయసు ఏడాది మేర తగ్గనుంది.
Also Read: Viral Video: బుర్కా వేసుకుని కాలేజ్‌లో స్టెప్పులు, సస్పెండ్ చేసిన యాజమాన్యం - వైరల్ వీడియో