By: Ram Manohar | Updated at : 09 Dec 2022 02:45 PM (IST)
మంగళూరులో ఓ కాలేజీ అమ్మాయిలు బుర్కా వేసుకుని స్టేజ్‌పై డ్యాన్స్‌లు చేయడం వివాదాస్పదమవుతోంది. (Image Credits:Twitter)
Viral Video:
కాలేజ్ ప్రోగ్రామ్‌లో..
కర్ణాటకలోని మంగళూరులో ఓ కాలేజీ విద్యార్థులు చేసిన పని వివాదాస్పదమైంది. కొంత మంది అమ్మాయిలు బుర్కా వేసుకుని స్టేజ్‌పై డ్యాన్స్ చేయటం సంచలనమైంది. కాలేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా జరిగిందీ ఘటన. రూల్స్‌కు విరుద్ధంగా వాళ్లు స్టేజ్‌పైకి వచ్చారని, అందుకే వారిని కంట్రోల్ చేయలేకపోయామని కాలేజీ సిబ్బంది చెబుతోంది. అయితే...అప్పటికే ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఓ హిందీ పాటకు బుర్కా వేసుకుని స్టెప్పులేశారు. "వాళ్లు ముస్లిం అమ్మాయిలే. వాళ్లను సస్పెండ్ చేశాం. విచారణ పూర్తయ్యేంత వరకూ వారిని కాలేజీలోకి అనుమతించం" అని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. "విద్యార్థులందరూ మేము పెట్టిన రూల్స్‌ని ఫాలో అయ్యారు. క్యాంపస్‌లోని విద్యార్థులందరికీ ఆ రూల్స్ ఏంటో తెలుసు" అని చెప్పింది. అసలు ఈ ప్రోగ్రామ్‌కు తాము అనుమతించలేదని, వాళ్లు ఉన్నట్టుండి వేదికపైకి వచ్చి డ్యాన్స్ చేశారని తెలిపింది. "మత గౌరవాన్ని దెబ్బ తీసే ఇలాంటి ఘటనలను అసలు ఉపేక్షించం" అని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. కొంత మంది యాజమాన్యం తీరుని తప్పు బడుతూ కామెంట్లు చేస్తున్నారు. "బుర్కా వేసుకుని డ్యాన్స్ చేయడంలో తప్పేముంది" అని ప్రశ్నిస్తున్నారు. "కాలేజ్ యాజమాన్యం వాళ్లను ఎందుకు సస్పెండ్ చేసింది. డ్యాన్స్ చేయడం తప్పు అని ఇస్లాంలో రాసుందా..? బుర్కా వేసుకోవడం తప్పు కానప్పుడు...బుర్కా వేసుకుని డ్యాన్స్ చేయడం ఎందుకు తప్పవుతుంది..?" అని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. "ఇది కచ్చితంగా తప్పే. బుర్కా వేసుకుని అలాంటి పాటలకు పిచ్చిగా డ్యాన్స్ చేయడమేంటి" అని మండి పడుతున్నారు.
This is from #Mangaluru, #Karnataka.
In an Event at St.Joseph Engineering College, Mangaluru students seen wearing #Burkha and performing obscene steps for a item song mocking #Burqa & #Hijab.#DakshinKannada #Mangalore #StJosephEngineeringCollege pic.twitter.com/Q6jmN5p77F — Hate Detector 🔍 (@HateDetectors) December 7, 2022
It was not part of the approved program and the students involved have been suspended pending enquiry. The college does not support or condone any activities that could harm the harmony between communities and everyone. (2/2)
— St Joseph Engineering College, Mangaluru (@SJEC_Mangaluru) December 8, 2022
Also Read: BSNL 5G Service: 5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ - టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!
Weather Latest Update: తెలంగాణలో కొనసాగుతున్న చలి, అతితక్కువ ఉష్ణోగ్రత ఎక్కడంటే
MAT 2023 Notification: మేనేజ్మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ABP Desam Top 10, 7 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Petrol-Diesel Price 07 February 2023: జేబు గుల్ల చేస్తున్న పెట్రోల్ ధరలు, తిరుపతిలో మరీ దారుణం
Gold-Silver Price 07 February 2023: బంగారం పైకి, వెండి కిందకు - ఇవాళ్టి రేటు ఇది
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!