Presidential Election Result 2022 LIVE: ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ
India Presidential Election Result 2022 LIVE: భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు.
LIVE
Background
2022 రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది? వివిధ పార్టీలు ఇచ్చిన మద్దతు ప్రకారం ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా అనూహ్యంగా షాకిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికి మరి కాసేపట్లో సమాధానం రానుంది. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో మొదలుకానుంది. ఎవరు గెలిస్తే ఏ రికార్డులు ఉన్నాయి?
అభ్యర్థుల ప్రొఫైల్
- ద్రౌపది ముర్ము– ఎన్‌డీఏ అభ్యర్థి
- రాష్ట్రం – ఒడిశా
- గిరిజన వర్గానికి చెందిన మహిళ
- చదువు – BA (గ్రాడ్యుయేట్)
- రాజకీయం జీవితం ఇలా మొదలు - కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. తర్వాత 1997 రాయ్‌రంగ్‌పుర్ ఎన్‌ఏసీ వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
ఎన్నికైతే
- గిరిజన వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతి.
- దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టి, రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా రికార్డ్ (పుట్టిన తేదీ: 20/06/1958)
- రెండవ మహిళా రాష్ట్రపతి (ప్రతిభా పాటిల్ తర్వాత)
ఏఏ బాధ్యతలు నిర్వహించారు
- ఝార్ఖండ్ గవర్నర్– 2015 మే18 నుంచి 2021 జులై 13 వరకు
(ఝార్ఖండ్‌కు తొలి మహిళా గవర్నర్)
- ఒడిశా అసెంబ్లీకి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక – రాయ్‌రంగ్‌పుర్ (ST) సీటు
- 12వ అసెంబ్లీ- (2000 - 2004)
- 13వ అసెంబ్లీ (2004 - 2009)
- ఒడిశా శాసనసభ నుంచి 2007కు గాను ఉత్తమ ఎమ్మెల్యేగా నీల్‌కాంత్ అవార్డు అందుకున్నారు.
ఒడిశా అసెంబ్లీ
- రవాణా మంత్రి - 06/03/2000 నుంచి 06/08/2002
- మత్స్య, పశుసంవర్థకశాఖ- 06/08/2002 నుంచి 16/05/2004
ఇంకా
- 1979 నుంచి 1983 – ఒడిశా ఇరిగేషన్, పవర్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్
- 1994 నుంచి 1997 – రాయ్‌రంగ్‌పుర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో అధ్యాపకురాలు
- 2002 నుంచి 2009 – భాజపా ఎస్‌టీ మోర్చా మెంబర్
- 2006 నుంచి 2009 – భాజపా ఎస్‌టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు
- 2013 నుంచి 2015 - భాజపా ST మోర్చా సభ్యురాలు (జాతీయ కార్యదర్శి)
ఇతర వివరాలు:
- పుట్టిన తేదీ– జున్ 20, 1958 (64 ఏళ్లు)
- తండ్రి - కీ.శే. బిరాంచి నారాయణ్ తుడు
- భర్త - శ్రీ శ్యామ్ చరణ్ ముర్ము
- పిల్లలు – ముగ్గురు (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె)
- వృత్తి – రాజకీయాలు, సామాజిక సేవ
- హాబీ: పుస్తకాలు చదవడం, కుట్లు, అల్లికలు
- యశ్వంత్ సిన్హా – విపక్షాల ఉమ్మడి అభ్యర్థి
- యశ్వంత్ సిన్హా- 1937 నవంబర్ 6న పట్నాలో జన్మించారు.
- 1958లో రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు.
- 1960లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
- 1984లో ఐఏఎస్‌కు రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు.
- 1986లో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1988లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
- 1990 నవంబర్ నుంచి 1991 జూన్ వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా చంద్రశేఖర్ కేబినెట్‌లో పనిచేశారు.
- 1992 నుంచి 2018 వరకు భారతీయ జనతా పార్టీ (భాజపా)లో సభ్యుడిగా ఉన్నారు.
- 2002 జులై నుంచి 2004 మే వరు అటల్ బిహారీ వాజ్‌పేయీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభం - టేబుల్ టెన్నిస్‌లో విమెన్స్ టీం విజయం
కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ తొలిరోజే శుభారంభం చేసింది. ఇండియన్ విమెన్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ సౌతాఫ్రికాపై 3-0 తేడాతో విజయం సాధించింది. డబుల్స్ ఈవెంట్‌లో శ్రీజ ఆకుల, రీత్ టెన్నిసన్, సౌతాఫ్రికాకు చెందిన లాయిలా ఎడ్‌వర్డ్స్, దనిష పటేల్‌పై గెలుపొందారు. 11-7,11-7,11-5 తేడాతో శ్రీజ ఆకుల, రీత్ టెన్నిసన్ విజయం సాధించారు.
ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ
భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపొందారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడంపై ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా ఆమెకు అభినందనలు తెలిపారు.
Prime Minister Narendra Modi congratulates NDA's #DroupadiMurmu on being elected as the President of the country; thanks "all those MPs and MLAs across party lines who have supported the candidature of Droupadi Murmu Ji." pic.twitter.com/TTdRjvPpYb
— ANI (@ANI) July 21, 2022
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ద్రౌపది ముర్మకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతిగా భారత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని, రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించాలని ఆయన కోరారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్విట్టర్ వేదికగా ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.
Union HM Amit Shah congratulates NDA's #DroupadiMurmu on being elected as the President of India; thanks "NDA allies, other political parties & independent representatives for voting in favour," of her. He further added, "I am sure her tenure will make the country more proud." pic.twitter.com/2gzhZElZyP
— ANI (@ANI) July 21, 2022
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాపై ఘన విజయం
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుపొందారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘన విజయం సాధించారు.
రెండో రౌండ్‌లోనూ దూసుకుపోయిన ద్రౌపది ముర్ము-కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో రెండో రౌండ్‌లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యం సాధించారు. రెండో రౌండ్ తరవాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పది రాష్ట్రాల బ్యాలెట్ పేపర్లను లెక్కించారు. ఇందులో మొత్తం వ్యాలిడ్ ఓట్లు 1, 138 కాగా, వాటి విలువ 1,49, 575. ఇందులో ద్రౌపది ముర్ము 809 ఓట్లు సాధించారు. వీటి విలువ 1,05,299. యశ్వంత్ సిన్హా 329 ఓట్లు సాధించారు. ఈ ఓట్ల విలువ 44, 276.
15 ఓట్లు చెల్లలేదు
ఎంపీల ఓటింగ్‌లో మొత్తం 748 సభ్యుల ఓట్లు చెల్లగా మరో 15 ఓట్లు చెల్లలేదని రాజ్యసభ సెక్రటరీ జనరల్ వెల్లడించారు.