రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి ద్రౌపది ముర్ము గురించి 5 ఆసక్తికర విషయాలు మీకోసం

2009-14 వరకూ ద్రౌపది ముర్ము ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఇద్దరు కొడుకులను, భర్తను కోల్పోయారు. తరవాత ఆమె తల్లి, సోదరుడు కూడా మరణించారు.

2009లో ద్రౌపది ముర్ము పెద్ద కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందాడు. లక్ష్మణ్ ముర్ముని అతని బెడ్‌పై అపస్మారక స్థితిలో గుర్తించారు.

2012లో రెండో కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 2014లో ద్రౌపది ముర్ము భర్త శ్యామ్ చరమ్ ముర్ము కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందారు

ద్రౌపది ముర్ము కూతురు ఇతిశ్రీ ముర్ము ఓ బ్యాంక్ ఉద్యోగి. ఆమె ఓ రగ్బీ ప్లేయర్‌ను వివాహం చేసుకున్నారు.

రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు ద్రౌపది ముర్ము టీచర్‌గా పని చేశారు.

మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదని ముర్ము నిరూపించారు.

ముర్ము విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు భాజపా భారీ ఏర్పాట్లు 20వేల స్వీట్లతో వేడుకలు జరపనున్నారు.

గిరిజన వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతిగా ఆమె చరిత్రలో మిగిలిపోనున్నారు

ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం (Image Source: PTI)