వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి



ఏటా శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అయితే ఈ ఏడాది ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. కొందరేమో ఆగస్టు 5న ..మరికొందరు ఆగస్టు 12న వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని చెబుతున్నారు.



రెండో శుక్రవారం, మూడో శుక్రవారం అన్నది బండగుర్తు మాత్రమే. వాస్తవానికి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వ్రతం చేసుకుంటారు.



ఆగస్టు 12 శుక్రవారం రోజు పౌర్ణమి తిథి సూర్యోదయానికి ఉన్నప్పటికీ ఉదయం 8 గంటల సమయంలో పాడ్యమి వచ్చేస్తోంది. ఆగస్టు 12న వ్రతం చేసుకుంటే అమావాస్య ముందు వచ్చే శుక్రవారం అవుతుంది కానీ పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం అవదు.



రెండో శుక్రవారం అనే బండగుర్తు ప్రకారం చూసుకున్నా ఆగస్టు 5న రెండో శుక్రవారం వస్తోంది. ఎందుకంటే జూన్ 29 శుక్రవారం శ్రావణమాసం ప్రారంభమైంది. అంటే ప్రారంభమైన రోజే శుక్రవారం పడింది..మొదటి శుక్రవారం కూడా.



ఆగస్టు 5న వచ్చేది రెండో శుక్రవారం -పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం అవుతుంది. ఎలా చూసుకున్నా ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలన్నది పండితుల మాట.



వాస్తవానికి వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే మంచిదే కానీ..ఆ రోజు కుదరని పక్షంలో శ్రావణమాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు.



పర్టికులర్ గా వరలక్ష్మీ వ్రతం ఏ రోజు అంటే మాత్రం శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం లేదా పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం అనే చెప్పాలి.



స్త్రీలకు సర్వసుఖాలు, సౌభాగ్యాన్నిచ్చే వరలక్ష్మీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడని శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి చెప్పారు.



పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగేందుకు తగిన వ్రతం చెప్పండని కోరగా.. త్రినేత్రుడు చెప్పినదే వరలక్ష్మీవ్రతం.



టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాల్లోనూ ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారు.
images credit: Pinterest