ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఆడనని మాగ్నస్ క్లార్‌సన్ అంటున్నాడు. ప్రతిసారీ తనే గెలుస్తుండటంతో బోర్ కొట్టేసిందట. ఛాంపియన్‌షిప్ ఆడేందుకు ప్రేరణ లభించడం లేదని చెప్తున్నాడు. 2013 నుంచి అతడు ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా అవతరించాడు. 2013లో 22ఏళ్ల వయసులో విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి విజేతగా ఆవిర్భవించాడు. ఆ తర్వాత ఏడాదీ ఆనంద్‌నే ఓడించి ఛాంపియన్‌షిప్ కొట్టేశాడు. 2016లో కర్జాకిక్, 2018లో కరువానా, 2021లో నెపోనియాచిపై గెలిచాడు. 2011 నుంచి కార్ల్‌సన్ ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్నాడు. ప్రపంచ చెస్ చరిత్రలో 2882 ఎలో రేటింగ్ అందుకున్న తొలి ప్లేయర్. చెస్‌కు రిటైర్మెంట్ ఇవ్వలేదని, చెన్నైలో చెస్ ఒలింపియాడ్ ఆడతానని కార్లసన్ చెప్పాడు.