పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాభారత్ పథకం ప్రవేశపెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. దరఖాస్తు ప్రక్రియ - ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ కోసం పబ్లిక్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ అధికారి మీ పేరు లిస్టులో ఉందో లేదో చెక్ చేస్తారు లబ్ధిదారుల జాబితాలో మీ పేరుంటే ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ ఫోటోకాపీని ఇవ్వాలి. ఆ తర్వాత మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను కూడా సమర్పించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఇస్తారు. 15 రోజుల తర్వాత మీ ఇంటికి ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ వస్తుంది. కార్డు వచ్చాక ఏ ఆసుపత్రిలోనైనా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందొచ్చు. దేశంలోని పేదలకు మెరుగైన ఆరోగ్య సదుపాయం కల్పించాలన్నదే పథకం ఉద్దేశం.