అన్వేషించండి

Pradhan Mantri Matru Vandana Yojana: గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం - కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

Govt Financial Help To Pregnant: గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తొలి కాన్పుకు ఐదు, రెండో కాన్పుకు ఆరు వేలు అందిస్తోంది.

Pradhan Mantri Matru Vandana Yojana: గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తొలి కాన్పుకు అయితే ఐదు వేలు, రెండో కాన్పుకు అయితే ఆరు వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లుగా అందిస్తోంది. ఈ స్కీమ్‌ గురించి చాలా మందికి తెలియదు. ఈ పథకం పేరు ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన( PMMVY). ఈ పథకంలో భాంగా తొలిసారి గర్భం దాల్చే మహిళలకు ఐదు వేలు, రెండోసారి ప్రసవంలో ఆడ పిల్ల పుడితే ఆరు వేలు రూపాయలు సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఎవరు లబ్ధి పొందవచ్చు, ఎలా దరఖాస్తు చేయాలి వంటి అంశాలు మీకోసం అందిస్తున్నాం. 

ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన

గర్భం దాల్చిన మహిళలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకునేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా గర్బం దాల్చిన వెంటనే మహిళలు తమ పరిధిలోని ఆశా వర్కర్‌/ఏఎన్‌ఎం ద్వారా ఈ స్కీమ్‌కు సంబంధించిన పోర్టల్‌లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. తొలిసారి గర్భం దాల్చినట్టు అయితే ఐదు వేలు అందిస్తారు. ఈ పోర్టల్‌ పేరు నమోదు చేసుకున్న వారికి తొలి విడతలో గర్భం దాల్చిన ఆరు నెలల్లో మూడు వేల రూపాయలు నేరుగా లబ్ధిదారు అకౌంట్‌లో జమ అవుతుంది. రెండో విడతలో డెలివరీ తరువాత 14 వారాల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మిగిలిన రెండు వేలు రూపాయలు అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ పథకంలో భాగంగా అందించే ఆర్థిక సాయాన్ని ఏడాది కిందట వరకు మూడు విడతల్లో చెల్లించేవారు. కానీ, గతేడాది నుంచి రెండు విడతలకు కుదించారు. ప్రస్తుతం రెండు విడతల్లో తొలి గర్భం దాల్చిన లబ్ధిదారులకు నేరుగా అకౌంట్‌కు జమ చేస్తున్నారు. 

రెండోసారి అమ్మాయి పుడితే ఆరు వేలు

ఈ పథకంలో భాగంగా మూడేళ్ల కిందటి వరకు తొలి ప్రసవానికి మాత్రమే ఐదు వేలు అందించేవారు. కానీ, మూడేళ్ల నుంచి రెండోసారి గర్భం దాల్చిన బాలికకకు ప్రసవించే మహిళలకు ఆరు వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. రెండోసారి బాలికకు జన్మనిస్తే వారు ఏఎన్‌ఎం/ఆశా ద్వారా మరోసారి పీఎంఎంవీవైఎంఐఎస్‌( PMMVY MIS ) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 14 వారాల వ్యాక్సినేషన్‌ పూర్తయిన తరువాత ఆరు వేలు ఒకేసారి లబ్ధిదారు అకౌంట్‌లో జమ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ ప్రసవం జరిగినా ఈ సహాయాన్ని అందించనున్నారు. ఇందుకోసం లబ్ధిదారులు చేయాల్సిందంతా రిజిస్ర్టేషన్‌ చేసుకోవడమే. 

ఈ అర్హతలు తప్పనిసరి

ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే సాయం పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. గర్భం దాల్చిన మహిళ వయసు 18 ఏళ్లు దాటాలి. ఏడాదికి ఎనిమిది లక్షలు కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండకూడదు. మాతృ శిశు సంరక్షణ కార్డు గానీ, రేషన్‌కార్డు/ఆధార్‌కార్డు గానీ, కిసాన్‌కార్డు గానీ, ఈ శ్రమ కార్డుగానీ, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుగానీ ఉండాలి. రెండో ప్రసవంలో బాలిక పుడితే తప్పనిసరిగా బర్త్‌ సర్టిఫికెట్‌ను సమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఈ రెండు కాన్పులకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకోవడానికి దగ్గరలోని ఆశా కార్యకర్తనుగానీ, ఏఎన్‌ఎంగానీ సంప్రదించాల్సి ఉంటటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget