Kolkata: 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు, కోల్‌కతా హత్యాచార ఘటనపై చీఫ్ జస్టిస్
Kolkata Case: ఆందోళనలు చేస్తున్న వైద్యులకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా వెంటనే విధుల్లో చేరాలని స్పష్టం చేసింది.
Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. న్యాయం జరగాలని నినదిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు చోట్ల వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ కేసుపై విచారణ చేపడుతున్న క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని వ్యాఖ్యానించింది. వాళ్లనలా అసౌకర్యానికి గురి చేయడం సరికాదని అభిప్రాయపడింది. వైద్యులు వెంటనే నిరసనలు మానేసి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.
"వైద్యులంతా వెంటనే విధుల్లో చేరాలి. విధుల్లో చేరిన తరవాత మీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసుకునే బాధ్యత మాది. మీరు లేకుండా ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది"
- సుప్రీంకోర్టు
Supreme Court says let the health professionals return to work and once they return to duties the court will prevail upon authorities to not take adverse action.
— ANI (@ANI) August 22, 2024
Supreme Court says how would the public health infrastructure function if doctors did not return to work.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్యులు విరామం లేకుండా గంటల కొద్దీ పని చేస్తుంటారని, ఈ విషయం తెలుసని వెల్లడించింది. అన్ని గంటల పాటు పని చేసినప్పుడు వైద్యులు మానసికంగా, శారీరకంగా అలిసిపోతారని..అలాంటి సమయాల్లో ఎవరు వచ్చి ఏం చేసినా ప్రతిఘటించే శక్తి ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో పోలీసులను కొన్ని కీలక ప్రశ్నలు అడిగింది. మృతదేహాన్ని ఎప్పుడు చూశారు..? పోలీసులు ఎప్పుడు అక్కడికి వచ్చారు..? అని ప్రశ్నించింది. అంతే కాదు. అసహజ మరణం అని రిపోర్ట్ ఇవ్వడంపైనా విచారించింది. (Also Read: Kolkata: బుర్రంతా కామంతో నిండిపోయింది, మనిషి లక్షణాలే లేవు - నిందితుడిపై సైకో అనాలసిస్ షాకింగ్ రిపోర్ట్!)
"ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు విడ్డూరంగా ఉంది. ఇలాంటి కేసుని 30 ఏళ్లలో నేనెప్పుడూ చూడలేదు. అసహజ మరణం అని 10.30 గంటలకు రిజిస్టర్ చేస్తారా..? హాస్పిటల్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ విధులు నిర్వర్తిస్తున్న ఆ వ్యక్తి ఎవరు. ఆమె తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది"
- సుప్రీంకోర్టు
CJI Chandrachud says we have seen the CD, we can form the view of the movements of the police officers, when the body was seen, when the police came, unnatural death report, post mortem report, cremation and then FIR. It matches with the FIR also now.
— ANI (@ANI) August 22, 2024
Solicitor General Tushar… https://t.co/pMv8x4pqxM
Also Read: Kolkata: ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్