అన్వేషించండి

Kolkata: ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్

Kolkata Case: కోల్‌కతా హత్యాచార ఘటనపై సీబీఐ ఓ రిపోర్ట్ తయారు చేసి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. ఆత్మహత్య అని చిత్రించి మభ్యపెట్టారని ఈ నివేదికలో తేల్చి చెప్పింది.

Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార ఘటనపై సీబీఐ ఓ నివేదిక తయారు చేసింది. ఈ రిపోర్ట్‌ని సుప్రీంకోర్టులో సమర్పించింది. అయితే..ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది దర్యాప్తు సంస్థ. నేరం జరిగిన ప్రాంతంలో సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం జరిగిందని, బాధితురాలి కుటుంబ సభ్యుల్ని తప్పుదోవ పట్టించారని తేల్చి చెప్పింది. సీబీఐ తరపున వాదించిన సొలిసిటర్ జనరల తుషార్ మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదో రోజు విచారణ కొనసాగుతోందని, అయితే..క్రైమ్ సీన్‌ని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. అటు ప్రభుత్వం మాత్రం అదేమీ లేదని తేల్చి చెబుతోంది. ప్రతిదీ వీడియో తీశామని, అన్ని ఆధారాలున్నాయని వివరిస్తోంది. ఈ సందర్భంగా FIR నమోదైన తీరుపైనా సీబీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం జరిగిందని, ఈ విషయం బాధితురాలి కుటుంబ సభ్యులకూ అర్థమైందని వెల్లడించింది. 

"అన్నింటి కన్నా దిగ్భ్రాంతి కలిగించే నిజం ఏంటంటే బాధితురాలి అంత్యక్రియలు పూర్తయ్యాక 11.45 గంటలకు FIR నమోదు చేశారు. తల్లిదండ్రులకు ఇది ఆత్మహత్యే అని చెప్పి నమ్మించారు. ఆ తరవాత అంతా వీడియో తీశారు. ఇవన్నీ చూశాక కుటుంబ సభ్యులకూ అనుమానాలు వచ్చాయి. అక్కడ ఏదో దాస్తున్నట్టు వాళ్లూ సందేహించారు"

- సీబీఐ 

ఈ కేసులో ఆర్‌జీ కార్ హాస్పటల్‌ వ్యవహరించిన తీరుపైనా సీబీఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులలో ప్రోటోకాల్‌ని పక్కన పెట్టి మరీ హాస్పిటల్ అధికారులు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ని వెంటనే విధుల్లో నుంచి తప్పించారని వెల్లడించింది. అంతే కాకుండా క్రైమ్ సీన్‌ని కాపాడడంలోనూ విఫలమయ్యారని రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఈ హత్యాచారం గురించి తెలిశాక కూడా సందీప్ ఘోష్ ఏ విధంగానూ స్పందించలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించాడని సీబీఐ స్పష్టం చేసింది. నేరం జరిగిన చోట మరమ్మతులు చేయడంపైనా సీబీఐ ఫోకస్ పెట్టింది. సందీప్ ఘోష్‌ని ఇదే విషయమై ప్రశ్నిస్తోంది.  నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అనుమతి వచ్చింది. అయితే...అధికారులు ఇంకా ఈ టెస్ట్ చేయాల్సి ఉంది.

హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌కీ లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్నా సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. పైగా సందీప్ ఘోష్‌కి సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనితో పాటు పని చేసిన అధికారి ఒకరు చేసిన ఆరోపణలు కీలకంగా మారాయి. అనాథ శవాలను అమ్ముకుని వ్యాపారం చేసే వాడని ఆరోపించాడు. అంతే కాదు. బంగ్లాదేశ్‌ మాఫియాతోనూ లింక్స్ ఉన్నాయని చెప్పాడు. బయో వేస్ట్‌ని బంగ్లాదేశ్‌కి సప్లై చేస్తాడని ఆరోపించడమూ సంచలనమైంది. విద్యార్థులను కావాలనే ఫెయిల్ చేసి వాళ్ల నుంచి డబ్బులు గుంజి పాస్ చేసే వాడనీ అన్నాడు. ఈ ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకుని సీబీఐ విచారిస్తోంది. 

Also Read: Kolkata: 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు, కోల్‌కతా హత్యాచార ఘటనపై చీఫ్ జస్టిస్

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Embed widget