భారత్‌లోనే తొలి హైడ్రోజన్ షిప్‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ, త్వరలోనే కాశీలో సర్వీస్‌లు
PM Modi Tamil Nadu Visit: ప్రధాని మోదీ తమిళనాడులో తొలి హైడ్రోజన్ షిప్‌ని ప్రారంభించారు.
PM Modi Thoothukudi Visit: ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించారు. తూత్తుకుడిలో రూ.17,300 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు కేంద్రమంత్రి సరబానంద సోనోవాల్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఆయన తూత్తుకుడిలోని కులశేఖరపట్టిణంలో ఇస్రోకి చెందిన రెండో లాంఛింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తూత్తుకుడిలోని ఈ ప్రాజెక్ట్‌లతో కొత్త శకం మొదలవుతుందని అన్నారు.
"తూత్తుకుడిలోని ఈ అభివృద్ధి ప్రాజెక్ట్‌లతో తమిళనాడులో కొత్త శకం ప్రారంభం కానుంది. ఎన్నో ప్రాజెక్ట్‌లకు ఇవాళ శంకుస్థాపన జరిగింది. అభివృద్ధి చెందిన భారత్‌కి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ రోడ్‌మ్యాప్ లాంటిదే. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వీటిని మొదలు పెడుతున్నాం"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi to inaugurate and lay the foundation stone of multiple infrastructure projects worth more than Rs 17,300 crores in Thoothukudi. pic.twitter.com/yk3TXcL2GM
— ANI (@ANI) February 28, 2024
భారత్‌లోనే తొలి hydrogen fuel ferryని ప్రారంభించారు. కాశీలో గంగానదిపై ఇది త్వరలోనే సర్వీస్‌లు అందించనుంది. కాశీ ప్రజలకు ఇది తమిళనాడు అందించిన గొప్ప కానుక అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు.
"భారత్‌లోనే తొలి హైడ్రోడన్ ఫ్యుయెల్ ఫెర్రీని ప్రారంభించుకున్నాం. త్వరలోనే ఇది కాశీలోని గంగానదిపై సేవలు అందిస్తుంది. కాశీ ప్రజలకు తమిళనాడు అందించిన గొప్ప కానుక ఇది. అందులో ఎక్కిన ప్రయాణికులంతా తమిళనాడుని తమ సొంత రాష్ట్రంగా భావిస్తారు"
- ప్రధాని నరేంద్ర మోదీ
పదేళ్లలో ఎంతో చేశాం: ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం కృషి కారణంగా దాదాపు పదేళ్లలో ఎన్నో అభివృద్ధి ప్రాజెక్ట్‌లు ప్రారంభించుకున్నామని ప్రధాని మోదీ (PM Modi in Tamilnadu) స్పష్టం చేశారు. Logistics Performance Index లోనూ భారత్ 30వ స్థానానికి చేరుకుందని వెల్లడించారు. సముద్ర జలాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌ల అభివృద్ధి భవిష్యత్‌లో మరింత వేగవంతం అవుతుందని హామీ ఇచ్చారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో ప్రాజెక్ట్‌లు ఎక్కడికక్కడే నిలిచిపోయేవని విమర్శించారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు డిమాండ్ చేస్తున్న అభివృద్ధి పనులను తాము పూర్తి చేస్తున్నట్టు వివరించారు.
#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi says "With the efforts of the Central Govt, today India is creating new records in the field of maritime and waterways. In the last 10 years, India has climbed several places to 30th position in the Logistics Performance Index,… pic.twitter.com/mw2SpZNli1
— ANI (@ANI) February 28, 2024
Also Read: Mukesh Ambani News: అనంత్ అంబానీ ఫ్రీవెడ్డింగ్‌కు ఏర్పాట్లు, అతిథులు ఆశ్చర్యపోయేలా విందుకు సన్నాహాలు