Mukesh Ambani News: అంబానీ ఇంట పెళ్లి భాజాలు, ప్రీ వెడ్డింగ్ వేడుకలకే 2500 రకాల వంటకాలు
Ananth Wedding Vibes: ఆసియా అపర కుభేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడి ప్రీవెడ్డింగ్ కి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతిథుల కోసం ఏకంగా 2500 రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు.
Anant Ambani Wedding News Telugu: సామాన్యుల ఇంట పెళ్లి అంటేనే మేళతాళాలు, భాజాభజంత్రీలు, చుట్టపక్కాలతో నానా హడావుడి ఉంటుంది. జీవితంలో ఒక్కసారే వచ్చే అపురూపమైన ఘట్టాన్ని ఆనందమయంగా జరుపుకునేందుకు స్థోమతకు మించి ఖర్చు చేస్తారు. అప్పు చేసి మరీ ఘనంగా పెళ్లి జరిపిస్తుంటారు. అతిథులు పదికాలాలు గుర్తుంచుకునేలా పదిరకాల వంటలు పెళ్లి ఇంట ఘుమఘమలాడిపోతాయి. అలాంటిది ఆసియాలో అతిపెద్ద కుభేరుడు ఇంట పెళ్లి అంటే ఏ రేంజ్‌లో ఏర్పాట్లు ఉంటాయో ఊహించుకోండి. రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంట ఇప్పుడు అదే హడావుడి జరుగుతోంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani Marriage) పెళ్లివేడుకలు కనీవిని ఎరగని రీతిలో నిర్వహిస్తున్నారు.
ఘుమఘమలాడే వంటకాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani) ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సర్వం సిద్ధమవుతోంది. జులై 12వ తేదీన అనంత్ అంబానీ వివాహం జరగనుంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని జామ్‌నగర్ లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్(Radhika Merchant)తో అనంత్ అంబానీ పెళ్లి జరుగుతోంది. ఈ ముందస్తు పెళ్లివేడుకలకు దేశంలోని ప్రముఖలు హాజరుకానున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలిరానున్నారు. వీరికోసం ఘుమఘమలాడే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. దీనికి కోసం దేశంలోనే అత్యంత పేరుగడించిన 25 మందితోకూడా చెఫ్(Chef)ల బృందం ఇండోర్(Indore) నుంచి జామ్‌నగర్‌కు వెళ్లనుంది. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాలతోపాటు ఇండోర్ ఫుడ్‌కు ప్రాధాన్యమివ్వనున్నారు. పార్సీ నుంచి థాయ్ వరకు, మెక్సికన్(Mexican) నుంచి జపనీస్(Japanees) వరకు అన్ని రకాల వెరైటీలు సిద్ధం చేయనున్నారు. ముఖ్యంగా ఆసియన్ వంటలకు ప్రధాన్యమివ్వనున్నారు. అంతేకాకుండా వచ్చే అతిథులకు ఏమైనా స్పెషల్ వంటకం కావాల్సి వస్తే చిటికెలో అందించి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య అతిథుల ఆహార అవసరాలకు అనుగుణంగా మెనూ సిద్ధం చేస్తున్నారు. ముందస్తు పెళ్లి వేడుకలకు వచ్చిన అతిథులు జీవితంలో మర్చిపోలేని విధంగా రుచికరమైన పదార్థాలు సిద్ధం చేస్తున్నారు.
2500 వంటకాలతో విందు
మూడురోజుల పాటు జరగనున్న ముందస్తు పెళ్లి వేడుకల కోసం దాదాపు 2,500 రకాల వంటకాలను వడ్డించనున్నారు.ఒకరోజు వడ్డించిన వంటకాలు మరోరోజు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నార. కేవలం అల్పాహారం కోసమే 70 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం లంచ్ కి 250 రకాలు, రాత్రి డిన్నర్ కు మరో 250 రకాల పదార్థాలను వడ్డించనున్నారు. శాఖాహారి అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడురోజులపాటు రేయింబళ్లు జరగనున్న వేడుకల కోసం అర్థరాత్రికి కూడా స్నాక్స్ అందించనున్నారు.
అతిరథ మహారథులు
ప్రపంచనం నలుమూలల నుంచి వెయ్యిమందికి పైగా అత్యంత ప్రముఖులైన వెయ్యిమందికి పైగా అతిథులు హాజరుకానున్నారు . వీరిలో బిల్ గేట్, మెలిండా గేట్స్ తోపాటు మెటా సీఈఓ మెటా సీఈఓ మార్క్‌జూకర్‌బర్గ్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింగ్, అడ్నాక్ సీఈఓ సుల్తాన్ అహ్మద్, వాల్ట్ డిస్నీ సీఈఓ బాబా ఐగర్ వంటి వారు ఉన్నారు. అలాగే దేశీయ వ్యాపార దిగ్గజాల్లో గౌతమ్ అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, గోద్రేజ్ కుటుంబం, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకనీ, బిర్లా గ్రూప్ ఛైర్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా, సునీల్ మిట్టల్, పవన్ ముంజాల్, నిఖిల్ కామత్, దిలీప్ సంఘ్వీ వంటి వారికి ఆహ్వానాలు వెళ్లాయి. బాలీవుడ్ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీతో పాటు ముంబయి ఇండియన్స్ టీం సభ్యులను ఆహ్వానించారు.