సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాని మోదీ భేటీ, కీలక ఒప్పందాలపై సంతకాలు
Modi Salman Talks: ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు.
PM Modi Saudi Prince Talks:
ద్వైపాక్షిక చర్చలు
ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ యువరాజు మహమ్మద్ బిల్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. G20 సదస్సు ముగిసిన మరుసటి రోజే ఈ సమావేశం జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌కి మూడు రోజుల పర్యటనకు వచ్చిన మహమ్మద్ బిల్ సల్మాన్...Strategic Partnership Council సమావేశంలోనూ పాల్గొననున్నారు. సల్మాన్‌కి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. G20 సదస్సులో India-Middle East-Europe Economic Corridorపై చర్చ జరిగింది. చైనాకు దీటుగా ఈ కారిడార్‌ని నిర్మించేందుకు తీర్మానం చేశారు. ఈ అంశంపైనా సౌదీ యువరాజుతో చర్చించేందుకు ప్రధాని స్వాగతించారు. భారత్, మధ్యప్రాచ్యం, ఐరోపాలను కలిపే ఈ కారిడార్‌పై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు మోదీ, సల్మాన్. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన సహకారంపైనా చర్చలు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మహమ్మద్ బిన్ సల్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఆతిథ్యం ఇచ్చిన తీరు ఎంతో నచ్చిందని చెప్పారు. మెరుగైన భవిష్యత్ కోసం సౌదీ అరేబియా, భారత్ కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు.
"భారత్‌కు రావాడం చాలా సంతోషంగా ఉంది. G20 సదస్సుని విజయవంతంగా నిర్వహించిన భారత్‌కి అభినందనలు. ఈ సమావేశాల ద్వారా కీలక ప్రకటనలు చేసే అవకాశం దక్కింది. రెండు దేశాల భవిష్యత్ మెరుగ్గా ఉండేలా భారత్‌తో కలిసి పని చేసేందుకు సౌదీ అరేబియా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది"
- మహమ్మద్ మహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ అరేబియా యువరాజు
#WATCH | Crown Prince and Prime Minister of the Kingdom of Saudi Arabia Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud met Prime Minister Narendra Modi at Hyderabad House in Delhi. pic.twitter.com/QEiLHbIgQY
— ANI (@ANI) September 11, 2023
కీలక ఒప్పందాలు..
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. India-Saudi Strategic Partnership Council తొలి భేటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 2019లో తాను సౌదీ అరేబియాకి వెళ్లినప్పుడే ఈ కౌన్సిల్ సమావేశంపై చర్చ జరిగిందని వెల్లడించారు. ఈ భేటీ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి.
VIDEO | Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud, the Crown Prince and Prime Minister of the Kingdom of Saudi Arabia, greeted by President Droupadi Murmu and PM Modi at Rashtrapati Bhavan. pic.twitter.com/j6m6SK8OYx
— Press Trust of India (@PTI_News) September 11, 2023
Also Read: రామ మందిరం తెరుచుకున్నాక గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయేమో, ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు