అన్వేషించండి

UP News: లిఫ్ట్‌లో ఉండగా దాడి చేసిన కుక్క, చేతికి గాయమై విలవిలలాడిపోయిన బాలిక

Viral Video: నోయిడాలోని ఓ హౌజింగ్ సొసైటీ లిఫ్ట్‌లో బాలికపై కుక్క దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dog Bites Girl in Lift: యూపీలోని నోయిడాలో ఓ అపార్ట్‌మెంట్‌లో బాలికపై కుక్క దాడి చేసింది. నోయిడాలో ఈ తరహా ఘటనలు పెరుగుతున్న క్రమంలోనే ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ హౌజింగ్ సొసైటీ లిఫ్ట్‌లో పెంపుడు కుక్క బాలికపై దాడి చేసి గాయపరిచింది. నోయిడా సెక్టార్‌ 107లోని Lotus 300 సొసైటీలో జరిగిందీ ఘటన. లిఫ్ట్‌లోని సీసీ కెమెరాలో ఈ దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా వెంటనే వైరల్ అయిపోయింది. మే 3వ తేదీన ఈ ఘటన జరిగినా ఆలస్యంగా బయటకు వచ్చింది. లిఫ్ట్‌లో ఓ బాలిక నిలబడి ఉంది. ఓ ఫ్లోర్ వద్ద లిఫ్ట్ ఆగింది. తలుపులు తెరుచుకున్న వెంటనే పెంపుడు కుక్ లోపలికి వచ్చింది. వచ్చీ రాగానే ఆ బాలికపై దాడి చేయడం మొదలు పెట్టింది. చేతిని గట్టిగా కొరికింది. కుక్క నుంచి తప్పించుకునేందుకు బాలిక వెంటనే వెనక్కి వెళ్లిపోయింది. ఈ దాడి జరిగినప్పుడు బాలిక లిఫ్ట్‌లో ఒంటరిగా ఉంది. వెంటనే మరో వ్యక్తి అక్కడికి వచ్చి ఆ కుక్కని బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. అప్పటికే ఆ బాలిక చేతికి గాయమైంది. ఆ నొప్పిని తట్టుకోలేక గట్టిగా ఏడ్చింది. లిఫ్ట్‌లో కుక్కల్ని తీసుకెళ్లొద్దు అని అధికారులు ఎన్ని సార్లు హెచ్చరించినా యజమానులు పట్టించుకోవడం లేదు. గతంలోనూ చాలా సార్లు ఇలా లిఫ్ట్‌లో కుక్కలు దాడి చేసిన ఘటనలు నమోదయ్యాయి. ఈ బెడద తట్టుకోలేక ప్రభుత్వం పలు జాతుల కుక్కలపై నిషేధం విధించింది. ఆ జాతి కుక్కల్ని పెంచుకోవద్దని స్పష్టం చేసింది.  

23 రకాల కుక్కలపై నిషేధం..

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుక్కల దాడులు పెరుగుతున్న క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇటీవల లేఖలు పంపింది. దాడి చేసే ప్రమాదమున్న కుక్కల జాతులను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతులకు చెందిన కుక్కల్ని దిగుమతి చేసుకోవడం, అమ్మడం, బ్రీడింగ్ చేయడంపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది. ఈ జాబితాలో Rottweiler,Mastiffs, Terrier,Pitbull సహా 23 రకాల జాతుల కుక్కలున్నాయి. ఈ శునకాలు దాడి చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని కేంద్రం హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలకు Department of Animal Husbandry లేఖలు రాసింది. ఈ జాబితాలో ఉన్న కుక్కల్ని పెంచుకోడానికి ఇప్పటి వరకూ ఇచ్చిన లైసెన్స్‌లను వెనక్కి తీసుకోవాలని తేల్చి చెప్పింది.

Also Read: UP News: అత్యాచారం చేశాడంటూ యువకుడిపై తప్పుడు కేసు, మహిళకు జైలు శిక్ష విధించిన కోర్టు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్? - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
PV Sindhu Match: పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
పీవీ సింధు ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలో హవా అంతా మనదే..
Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Embed widget