Kargil War : కార్గిల్ కుట్ర తమ పాపమేనని అంగీకరించిన పాకిస్థాన్ - మొదటి సారి ఆర్మీ చీఫ్ ఒప్పుకోలు
Pakistan : భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన ఘటన కార్గిల్ యుద్ధం. అయితే ఇప్పటి వరకూ అది తమ పని అని పాకిస్థాన్ అంగీకరించలేదు. కానీ ఇప్పుడు నిజం బయటపడింది.
Pakistani Army officially accepts role in 1999 Kargil War : కార్గిల్ విషయంలో పాకిస్థాన్ సైన్యమే కుట్ర చేసిందని మొదటి సారి అధికారికంగా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ పాకిస్తాన్ కు సంబంధం లేదని.. జీహాదీలు, టెర్రరిస్టులే కార్గిల్ లో ఆక్రమణకు ప్రయత్నించాలని పాకిస్థాన్ బుకాయిస్తూ వచ్చింది. కానీ మొదటి సారి కార్గిల్ లో ఆక్రమణకు ప్రయత్నించింది తామేనని ఆ దేశ సైన్యాధిపతి ప్రకటన చేశారు. పాతకేళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం తమ పనేనని పాకిస్థాన్ అధికారికంగా స్టేట్ మెంట్ ఇచ్చినట్లయింది.
పాకిస్థాన్ లో 'డిఫెన్స్ డే' జరిగింది. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రసంగించారు. భారత్, పాకిస్థాన్ మధ్య 1948, 1965, 1971, 1999 కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేశారని చెప్పుకొచ్చారు. మిగతా అన్నీ ఓకే కానీ.. 1999 కార్గిల్ యుద్ధంలో అనే సరికి అసలు విషయం బయటకు వచ్చింది. ఎందుకంటే.. కార్గిల్ యుద్ధం చేసింది ముజాహిదీన్లని పాక్ చెబుతూ వస్తోంది.
ఆర్మీ చీఫ్ జనరల్ మాటల ప్రకారం 1999లో పాకిస్థాన్ ఆర్మీనే ముజాహిదీన్‌ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూబాగంలోకి అడుగుపెట్టారని స్పష్టమవుతోంది. కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను ముజాహిదిన్ ల రూపంలో ఉన్న పాక్ సైనికులు ఆక్రమించారు. విషయం తెలిసిన వెంటనే భారత్ 'ఆపరేషన్ విజయ్' ని చేపట్టింది. దొరికిన వారిని దొరికినట్లుగా చంపడంతో చాలా కాలం పోరాడిన ముజాహిదీన్ ఆర్మీ.. తర్వాత వెనక్కి పోయింది. కొన్ని వందల మంది పాకిస్తాన్ సైన్యం ఈ దాడుల్లో చనిపోయింది. అయితే వారందరూ ముజాహిదీన్ల పేరుతో బయటకు రాకుండా చూశారు.
Breaking: First time ever Pakistani Army accepts involvement in Kargil War; Sitting Pakistan Army Chief General Asim Munir confirms Pakistan Army involvement in Kargil War with India
— Sidhant Sibal (@sidhant) September 7, 2024
PS: Pakistani army has never publicly acknowledged its direct role in the Kargil War, so far pic.twitter.com/UgCUMfXHt9
కార్గిల్ నుంచి ముజాహిదిన్ల రూపంలో ఉన్న ముష్కర మూకల్ని 'ఆపరేషన్ విజయ్' తో తరిమి కొట్టారు. జూన్ 26న అందర్నీ హతమార్చడం లేదా తరిమేయడం చేసినట్లుగా తేలడంతో అదే రోజును 'కార్గిల్ దివస్'ను భారత్ జరుపుకుంటున్నాము. అంతర్జాతీయ వేదికల మీద కూడా కార్గిల్ ఆక్రమణతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కశ్మీర్ తిరుగుబాటుదారులు ఆ పనిచేశారని వాదిస్తూ వచ్ిచంది. పాక్ వాదనను అబద్దమని అనేక ఆధారాలు బయటపడినా.. చివరికి.. ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఒప్పుకోవడంతో అసలు కుట్ర ఖరారయింది.