Pakistan Air Space: పాకిస్తాన్ మీదుగా ఆకాశంలో వెళ్లడానికీ భయపడుతున్నారు - దారి మార్చుకుంటున్న ఎయిర్ లైన్స్ - భారీ నష్టం
Air Space: పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్లకుండా ఇతర ఎయిర్ లైన్స్ వేరే మార్గాన్ని చూసుకుంటున్నాయి. దీంతో పాకిస్తాన్ కు భారీ నష్టం ఏర్పడుతోంది.

Airlines Avoid flying over Pakistani airspace: పెహల్గాం ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ భారత విమానాలు తమ ఎయిర్ స్పేస్ లోకి రాకుండా నిషేధం విధించింది. అయితే ఇతర దేశాల విమానాలు కూడా ఇప్పుడు పాక్ ఎయిర్ స్పేస్ గుండా వెళ్లడం లేదు.
పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్‌ను కలిపే కీలకమైన కారిడార్. అంతర్జాతీయ విమాన సంస్థలు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌ను రెగ్యులర్‌గా ఉపయోగిస్తాయి, ముఖ్యంగా భారతదేశం, సెంట్రల్ ఆసియా, యూరప్ మధ్య రాకపోకలకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కీలకం. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ విమాన సంస్థలు స్వచ్ఛందంగా పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌ను ఉపయోగించుకోవడం మానేస్తున్నాయి. లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్‌వేస్) భద్రతా ఆందోళనల కారణంగా అరేబియన్ సముద్రం, ఇరాన్, లేదా టర్కమెనిస్తాన్ మీదుగా ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకుంటున్నాయి. ఇది పాకిస్తాన్‌కు ఓవర్‌ఫ్లైట్ ఫీజ్ రూపంలో అదనపు ఆదాయ నష్టాన్ని కలిగిస్తోంది. ఒక బోయింగ్ 737కి సుమారు 580 డాలర్లు చెల్లించాలి.
రోజువారీగా300,000 డాలర్ల నష్టంతో పాకిస్తాన్ నెలకు సుమారు 75 కోట్లు రూపాయలు కోల్పోతోంది. ఒక సంవత్సరం పాటు ఈ ఆంక్షలు కొనసాగితే, నష్టం సుమారు 100-110 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా వెయ్యి కోట్ల వరకూ ఆదాయ నష్టం ఉంటుందని అంచనాలు ఉన్నయి. ఇది కేవలం భారత విమానాలకు ఎయిర్ స్పేస్ మూసేయడం వల్ల వచ్చే నష్టం మాత్రమే. పాశ్చాత్య ఎయిర్‌లైన్స్ నిరాకరణ వల్ల ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది, ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తుంది, ఇప్పటికే ఆ దేశం విదేశీ మారక నిల్వలు $3.7 బిలియన్‌కు పడిపోయాయి.
భారతదేశం కూడా పాకిస్తాన్ విమానాలకు తన ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. దీని వల్ల పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ శ్రీలంక, చైనా, ఇతర రూట్ల ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది, ఇది వారి ఇంధన ఖర్చు,ప్రయాణ సమయాన్ని పెంచుతుంది. భారత విమానాలకు ఎయిర్‌స్పేస్ మూసివేయడం భారతదేశానికి నష్టం కలిగిస్తుందని భావించినప్పటికీ, పాకిస్తాన్‌కే ఎక్కువ ఆర్థిక భారం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
A busy Indian Airspace
— Resonant News🌍 (@Resonant_News) April 25, 2025
Vs
an almost empty Pakistan’s air space pic.twitter.com/sg92lPKTMO
దోహా నుంచి లండన్ లేదా పారిస్‌కు వెళ్లే విమానాలు తరచుగా పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌ను ఉపయోగిస్తాయి, కానీ దక్షిణ భారతదేశం నుంచి దోహాకు వెళ్లే విమానాలు అరేబియన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తాయి. సింగపూర్ నుంచి యూరప్‌కు వెళ్లే విమానాలు భారత ఎయిర్‌స్పేస్ లేదా చైనీస్ ఎయిర్‌స్పేస్‌ను ఉపయోగించవచ్చు. బెంగళూరు లేదా ముంబై నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లే విమానాలు అరేబియన్ సముద్రం లేదా ఒమన్ ఎయిర్‌స్పేస్‌ను ఉపయోగించవచ్చు. పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ ఇతర దేశాల విమానాలకు ఓపెన్‌గా ఉంది, కాబట్టి అవి సాధారణంగా ఈ రూట్‌ను ఉపయోగిస్తాయి. అయితే, భద్రతా ఆందోళనలతో పాకిస్తాన్ ఆకాశంలోకి వెళ్లడానికి కూడా బయపడుతున్నారు.





















