NGT : "పాలమూరు - రంగారెడ్డి" పై 29న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు !
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అక్రమం అంటూ ఏపీ రైతులు, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై 29వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్జీటీ నిర్ణయించింది.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై తక్షణం స్టే ఆర్డర్ ఇవ్వాలని.. ఇప్పటికే తెలంగామ ప్రభుత్వం అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులను 29వ తేదీన ఇస్తామని ఎన్జీటీ ప్రకటించింది. గురువారం జరిగిన విచారణలో ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరాం స్వయంగా వాదనలు వినిపించారు. ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్లకిందట ప్రారంభించారని.. ఆరు రిజర్వాయర్లు కట్టారని ఇంకా కొనసాగనిస్తే చట్ట విరుద్ధమవుతుందని వాదించారు. పర్యావరణ చట్టాలను కూడా ఉల్లంఘించినట్లుగా స్పష్టంగా ఉందని వాదించారు.
Also Read : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా ! లోకేష్ - ఆళ్ల హోరాహోరీలో పైచేయి ఎవరిది ?
అయితే ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైన ఆరు నెలలలోపే ఫిర్యాదు చేయాల్సి ఉందని తెలంగాణ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది. ఇరు వర్గాల వాదనలు విన్న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు 29వ తేదీన ఇస్తామని తెలిపి.. కేసును అప్పటికి వాయిదా వేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. పర్యావరణ అనుమతులు లేవని.. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తుందని, దీనివల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పర్యావరణ హాని కలుగుతుందని రైతులు, ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.
Also Read : "దుర్గమ్మ గుడి మొత్తం వైఎస్ఆర్‌సీపీ రంగుల లైట్లు..." నిజం కాదు ! ఫేక్ !
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కోసం ఈ ప్రాజెక్టును చేపట్టిందని, తాగునీటి ప్రాజెక్టు పేరుతో పర్యావరణ అనుమతులను తీసుకోకుండా పనులు మొదలు పెట్టిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై కేంద్రం తన వైఖరిని వెంటనే చెప్పాలని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోరారు. అయితే కేంద్రం తరపు న్యాయవాది స్పందిస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, తుది విచారణలో తప్పకుండా కేంద్రం వైఖరి వెల్లడిస్తామని ధర్మాసనానికి తెలియజేశారు.
Also Read : ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ తేదీలోగా ఆప్షన్లు ఇవ్వండి
అయితే తెలంగాణ ప్రభుత్వంపిటిషన్ దాఖలుకు ఆరు నెలల కాలపరిమితి ఉంటుందని ఆ సమయం మించి దాఖలు చేసిన పిటిషన్లను విచారించకూడదని వాదిస్తున్నారు. 2015 లో ఇచ్చిన జీవో ప్రకారం తాగునీటి ప్రాజెక్టు కోసం మాత్రమే నిర్మాణం చేపట్టామని, రెండవ దశలో సాగునీటి ప్రాజెక్టుకు అనుమతులు కోరామని తెలంగాణ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లింది. వీటన్నింటికీ ఏపీ అడ్వకేట్ జరల్ కౌంటర్ ఇచ్చారు. 29వ తేదీన కీలక తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read : సమస్యలు పరిష్కరించకపోతే పోరు బాట.. ఏపీ ప్రభుత్వానికి రెండు ఉద్యోగ సంఘాల హెచ్చరిక !