AP Employees : సమస్యలు పరిష్కరించకపోతే పోరు బాట.. ఏపీ ప్రభుత్వానికి రెండు ఉద్యోగ సంఘాల హెచ్చరిక !
ఏపీలో రెండు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ఏపీ ఎన్జీవో, అమరావతి ఏపీ జేఏసీ నేతలు సమస్యల్ని పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్యోగ సంఘం నేతలు కోరారు. సమస్యలు పరిష్కరించకపోత ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. విజయవాడలో ఉద్యోగ సంఘం నేతలు మీడియా సమావేశం పెట్టారు. సమస్యలు చెప్పుకోవడానికి సీఎం జగన్ అవకాశం ఇవ్వడం లేదన్నారు. అమరావతి ఏపీ జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సంఘాలు సమస్యల సాధనకై ఏకతాటిపైకి వచ్చాయని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వడంలేదని, పెన్షన్లు అందని పరిస్థితి నెలకుందని ఉద్యోగ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ ఏరియర్స్, పీఆర్సీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి చీఫ్ సెక్రటరీతో మరోసారి చర్చిస్తామని సానుకూల నిర్ణయం రాకపోతే ఉమ్మడి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు కరోనాతో మరణిస్తే, మట్టి ఖర్చులకు కూడా నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఒకలాగా, ఖర్చులు మరోలా చేస్తున్నారని విమర్శించారు. 11వ పీఆర్సీ 39 నెలలుగా పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు.
Also Read : బద్వేలులో త్రిముఖ పోటీ.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ !
ఏపీలో సీపీఎస్ ఉద్యోగులు ఇప్పటికే పోరుబాట పట్టారు. అధికారలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దు అని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ రద్దు చేయలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని.. ఉద్యోగుల్లో అసంతృప్తి పేరుకుపోతోంది. సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు మాత్రం.. పాత పెన్షన్ విధానంపై గంపెడాశలు పెట్టుకున్నారు. వారంతా ఓ సంఘంగా ఏర్పడ్డాయి.ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా ఏర్పడ్డారు. నిరసనలు ప్రారంభించాలరు. క్విట్ సీపీఎస్ పేరుతో ఉద్యమాలు చేస్తూ పింఛను విద్రోహ దినం-నయవంచన సభలు కూడా నిర్వహిస్తున్నారు.
Also Read : "అమరావతి పాఠం" తొలగింపుపై విమర్శలు .. స్పందించని ప్రభుత్వం !
ఇటీవలి కాలంలో ఉద్యోగులకు నెల జీతాలే సక్రమంగా రావడం లేదు. దీంతో పెండింగ్‌లో డీఏలు.. పీఆర్సీ గురించిన సమస్యలను కూడా ప్రస్తావిస్తూ ఇతర ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళనలు ప్రారంభిస్తున్నాయి. ఇప్పటి వరకూ సీపీఎస్ రద్దు, పీఆర్సీ, డీఏల విషయంలో ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అదే సమయంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకపోతూడంటంతో ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. సమస్యలు చెప్పుకునేందుకు వారికి అవకాశం లభించకపోవడంతో మీడియా ముందుకు వస్తున్నారు.
Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ