Artemis I: ఆర్టెమిస్-1 ప్రయోగం సెకండ్ అటెంప్ట్ ఆ రోజునే, వెల్లడించినా నాసా
Artemis I: సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన ఆర్టెమిస్-1 ను మరోసారి ప్రయోగించేందుకు నాసా సిద్ధమవుతోంది.
Artemis I:
ఆర్టెమిస్ 1 ను మళ్లీ ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది. రెండో అటెంప్ట్ చేసే టైంను వెల్లడించింది. చంద్రుడి కక్ష్యలోకి ప్రయోగించేందుకు చేపట్టిన ఆర్టెమిస్ 1...మొదటి ప్రయత్నంలో...సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది.ఇంజిన్ లో హైడ్రోజన్ లీక్ కావటంతో లాంచింగ్ 3 రోజుల క్రితం నిలిచిపోయింది. సాంకేతిక సమస్యపై పరిశీలించిన ఆర్టిమెస్ 1 బృందం...తర్వాతి లాంచింగ్ డేట్ ను ప్రకటించింది. అమెరికా టైమింగ్ ప్రకారం సెప్టెంబర్ 3 రాత్రి 9 గంటల 45 నిమిషాలకు, భారత కాలమానంప్రకారం..సెప్టెంబర్ 4 తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు ఆర్టెమిస్ 1 ను మళ్లీ ప్రయోగించబోతున్నట్టు నాసా వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ధృవంపైకి మనుషులను పంపించాలని మూడు దశలుగా నాసా చేప్టటిన ఆర్టెమిస్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ఆర్టెమిస్-1 లాంచింగ్ జరగబోతోంది.
We're now targeting Saturday, Sept. 3 for the launch of the #Artemis I flight test around the Moon. The two-hour launch window opens at 2:17 p.m. ET (18:17 UTC). pic.twitter.com/MxwdcKHGdd
— NASA (@NASA) August 30, 2022
వాయిదాకు కారణమిదే..
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. చంద్రుడి కక్ష్యలోకి ప్రయోగించే ఆర్టెమిస్-1 ఇంజిన్ లో హైడ్రోజన్ లీక్ కావటంతో లాంఛింగ్ ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. ఆర్టిమెస్-1 బృందం సాంకేతిక సమస్యపై పరిశీలిస్తున్నట్లు ప్రకటించిన నాసా తదుపరి లాంఛింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని సోమవారం తెలిపింది. ఇప్పుడు కొత్త తేదీ ప్రకటించింది. చంద్రుడి దక్షిణ ధృవంపైకి మనుషులను పంపించాలని మూడు దశలుగా నాసా చేప్టటిన ఆర్టెమిస్ ప్రాజెక్ట్ లో ఆర్టెమిస్-1 చంద్రుడి కక్ష్యలోకి వెళ్లాల్సి ఉంది. ఈ రోజు లాంఛింగ్ నిలిచిపోయింది. ఆర్టెమిస్-1 రాకెట్‌లో ఇంధన లీకేజ్ వల్ల ప్రయోగాన్ని నిలిపివేశారు.
రాకెట్‌లో 10 లక్షల గ్యాలన్ల హైడ్రోజన్, ఆక్సిజన్ నింపాల్సి ఉంది. లీకేజి వల్ల ఈ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఇంజిన్ నంబర్-3లో సమస్య వల్ల రాకెట్ లాంఛ్‌ను వాయిదా వేశాం. రాకెట్ ఉన్న చోట లాంచ్‌పాడ్‌పై పిడుగులు పడ్డాయి. దీంతో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోందని నాసా శాస్త్రవేత్తలు సోమవారం వెల్లడించారు. 2025 నాటి కల్లా చంద్రుడి మీద ఉన్న సౌత్ పోల్ మీదకు మనిషిని చేర్చటమే ఆర్టిమెస్ మిషన్ లక్ష్యం. అందుకే దాదాపు యాభై ఏళ్ల తర్వాత మళ్లీ నాసా ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ను చేపట్టింది. చంద్రుడి మీద స్థావరాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే, అక్కడి నుంచి మార్స్ సహా అనేక అంతరిక్ష పరిశోధనలు చేసేందుకు వీలవుతుంది. అదే నాసా ప్లాన్.
ఆర్టెమిస్ అంటే అర్థమిదే..
ఆర్టెమిస్ అంటే ఓ గ్రీకు దేవత. ఇంతకు ముందు నాసా చంద్రుడి మీదకు ప్రయోగాలు చేసిన ప్రాజెక్ట్ పేరు అపోలో. ఆ అపోలోకు ఈ ఆర్టెమిస్ గ్రీకు పురాణాల ప్రకారం సోదరి వరుస. సో అందుకే అపోలో తర్వాతి ప్రాజెక్ట్ కు ఆర్టెమిస్ పేరు పెట్టారు. గ్రీకు పురాణాల ప్రకారం చంద్రుడి అధిదేవత కూడా ఆర్టెమిస్. ఆర్టెమిస్ ప్రాజెక్టులో నాసా ది కీలక భాగమైన్పపటికీ మిగతా స్పేస్ ఏజెన్సీలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. నాసానే ఈ అవకాశాన్ని కల్పించింది. ఇప్పుడు ఆర్టెమిస్ లో కీలకంగా వ్యవహరించనున్న ఓరియన్ క్యాప్యూల్స్ నిర్వహణలో కీలకపాత్ర పోషించేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంతే కాదు ఆర్టెమిస్ అకార్డ్స్ పేరుతో మిగిలిన దేశాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావచ్చని ఎప్పుడూ లేని విధంగా నాసా ఓ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది.
Also Read: vinayaka chavithi 2022: వినాయక చవితి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి! Part-1