vinayaka chavithi 2022: వినాయక చవితి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి! Part-1
vinayaka chavithi 2022: ఏటా భాద్రపద శుద్ధ చవితి రోజు లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేస్తాం. ఈ ఏడాది వినాయకచవితి ఆగస్టు 31 బుధవారం వచ్చింది. ఆ పూజా విధానం మీకోసం... ముందుగా పసుపు గణపతి పూజా విధానం...
Vinayaka Chavithi Vratham 2022: విఘ్నాలు తొలగించి విజయం సిద్ధించేలా చేసే వినాయకుడికే అన్నింటా తొలి ప్రాధాన్యం. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడినే పూజిస్తాం. మరి వినాయక చవితి రోజు ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఊరూ-వాడ, చిన్నా పెద్దా అందరికీ సంబరమే. ఈ ఏడాది వినాయకచవితి ఆగస్టు 31 బుధవారం వచ్చింది. ఆ పూజా విధానం మీకోసం...
పూజకు కావాల్సిన సామాగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తులు, పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు, పాలవెల్లి. ఎప్పటిలానే ముందుగా పసుపు వినాయకుడి దీప, ధూప, నైవేద్యాలు పూర్తిచేసి..ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి పూజించాలి.
పసుపు గణపతి పూజ
శ్లోకం:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే.
ఆచమనీయం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా ,ఓం గోవిందాయ నమః ,ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః , ఓం త్రివిక్రమాయ నమః ,ఓం వామనాయ నమః , ఓం శ్రీధరాయ నమః , ఓం హ్రిషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః , ఓం దామోదరాయ నమః , ఓం సంకర్షణాయ నమః , ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః , ఓం అనిరుద్ధాయ నమః ,ఓం పురుషోత్తమాయ నమః , ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః , ఓం అచ్యుతాయ నమః , ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః.
Also Read: అష్టకష్టాలు తీర్చే అష్ట వినాయకులు, ఒక్కసారైనా దర్శించుకుంటే చాలు
గణపతికి నమస్కరించి
యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన: ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
ఈ మంత్రం చెపుతూ దేవుడిపై అక్షింతలు వేయాలి.
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||
(క్రింది విధముగా చదువుతూ అక్షింతలు వాసన చూసి వెనుక వేసుకోవాలి)
శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే
(ప్రాణాయామం) ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||.
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లాలి.
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, ( మీరు దగ్గరగా ఉన్న నదిని చెప్పుకోండి) నదీ సమీపే. నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ ప్లవ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే, శుక్ల పక్షే చతుర్థ్యాం, సౌమ్యవాసరే (బుధవారం), శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్ ( ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి) ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకోవాలి)
ఆధౌ నిర్వఘ్నేన పరిసమాప్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే...తదంగ కలశారాధనం కరిష్యే అని చెప్పి కలశ జలంలోగంధం, అక్షతలు, పుష్పాలు ఉంచాలి
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు`
( కలశలో నీటిని మీపై, పూజా ద్రవ్యాలపై చల్లాలి)
పసుపు గణపతిపై అక్షింతలు వేస్తూ చదవాలి
ఓం గణానాంత్వా గణపతిగ్ంహావామహే కవిం కవీనాం ముమమశ్శ్రవస్తవం| జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యన్నూతిభిస్సీద సాదనమ్. శ్రీ మహాగణాధిపతియే నమః: ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత స్వర్ణ సింహసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపనంతరం శుద్దాచమనీయం సమర్పామి.
నైవేద్యం
ఓం భూర్భువస్సువ:ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్. నీళ్ళు పుష్పంతో చల్లి ఓం సత్యం త్వర్తేన పరిషించామి. పుష్పము నీటిలో ముంచి నైవేద్య పదార్ధమ్ చుట్టు తిప్పాలి. ఓం అమృతమస్తు | ఓమ్ అమృతోపస్తణమసి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధంగా చదివి కలశములోని నీటి వదలవలెను.) మధ్య మధ్య పానీయం సమర్పణమి.
శ్రీ మహాగణాధిపతియే నమః తాంబులం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతియే నమః: ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి
పూజ చేసిన అక్షింతలు, పూలు తలపై వేసుకుని
శ్లోకం
యస్యస్మృతాచ నామూక్త్యా తప: క్రిమాదిషు|న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే గణాధిప | మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణాధిప | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా భగవన్ సర్వాత్మక: శ్రీ మహాగణాధిపతి: వరదోభవతు అని ఉదకం అక్షితలను చేతిలో వేసుకుని గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి.
ఉద్వాసన
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్యచం తే యత్ర పూర్వే సాధ్యాస్సతి దేవా: శ్రీ మహాగణపతిం యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధే పునరాగమనాయచ|| పసుపు గణపతిని తమలపాకుతో తీసి పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచవలెను.
ఇక్కడి వరకూ పసుపు గణపతి పూజ చేశారు..ఇప్పుడు మీరు తీసుకొచ్చిన విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన చేసి ఆచమనీయం చేసి గణపతికి షోడసోపచార పూజ చేయాలి...పూజకోసం ఈ లింక్ క్లిక్ చేయండి...
Also Read: వినాయక చవితి పూజా విధానం Part-2
Also Read: వినాయక చవితి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథలివే!