Vinayaka Chavithi 2022: అష్టకష్టాలు తీర్చే అష్ట వినాయకులు, ఒక్కసారైనా దర్శించుకుంటే చాలు
Ganesh Chaturthi 2022 : శివుడికి 12 జ్యోతిర్లింగాలు, పార్వతి దేవికి 52 శక్తి పీఠాలు, విష్ణుకు 108 దివ్య దేశాలు ఎలా ఉన్నాయో వినాయకుడికి కూడా అష్టవినాయక ఆలయాలున్నాయి. అవేంటో, ఎక్కడున్నాయో చూద్దాం
Vinayaka Chavithi 2022: అష్టవినాయకులు అనగానే ఒక్కోటి ఒక్కో రాష్ట్రంలో ఉందేమో అనుకోవద్దు. ఈ అష్ట వినాయకు ఆలయాలన్నీ పుణెలకు దగ్గర్లోనే ఉన్నాయి. కేవలం వంద కిలోమీటర్ల పరిధిలో ఈ ఎనిమిది ఆలయాలున్నాయి. పుణె చేరుకుంటే ఈ అష్ట వినాయకులను దర్శించుకోవచ్చు. ఒక్కొక్క ఆలయంలో వినాయకుడు ఒక్కొక్క రూపంలో పూజలందుకుంటాడు. ఆ ఆలయాలు పేర్లేంటో, అవి పుణెకు ఎంతదూరంలో ఉన్నాయో తెలుసుకుందాం..ఈ దేవాలయాలలో గణేశ విగ్రహాలు స్వయంభూ అని చెబుతారు.ఈ ఆలయాల్లో ఉన్న విగ్రహాల్లో ఏ ఒక్క దాని తొండం ఒకే ఆకృతిని కలిగి ఉండదు.
1.శ్రీ అష్టవినాయక మందిరం
ఇది పుణెకు 80 కిలోమీటర్ల దూరంలోని మోరేగావ్ లో ఉంది.
స్వస్థీ శ్రీ గణనాయం గజముకమ్ మోరేశ్వర సిద్ధూడం బాలలమ్ మురుదుం
వినాయక మహాం చింతామనీం తేవరం | లెనిద్రామ్ గిరిజత్మజం సువారదాం
విగ్నేశ్వర ఓజరం గంగం రంజననామకే గణపతి
|| కురియాత్ సదా మంగళం ||
2.మోరేశ్వర్
ఇక్కడ వినాయకుడు నెమలి మీద కూర్చున్న విగ్రహాన్ని ప్రత్యేకంగా చూడవచ్చు. మయూరేశ్వర్ అవతారంలో వినాయకుడు సింధూని హతమార్చాడని చెబుతారు. విగ్రహానికి ఎడమ వైపు తొండం ఉంటుంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద ఉన్న నంది విగ్రహాన్ని శివుడు పెట్టాడని చెబుతారు.
||ఓం మాయరేశ్వరాయ నమా ||
3.సిద్దాక్రీ
ఇది పుణెలకు 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాటెక్ గ్రామంలో ఉంది. ఈ విగ్రహం మూడు అడుగుల ఎత్తున ఉత్తర దిశగా ఉంటుంది. తొండం కుడి చేతి వైపు తిరిగి ఉంటుంది. ఇక్కడ ప్రదిక్షిణ చేయాలంటే దాదాపు 5 కిలోమీటర్లు నడవాలి
|| ఓం సిద్దివినాయక నమః ||
4.బల్లలేశ్వర్
పుణె నుంచి పాలి గ్రామానికి 119 కిలోమీటర్ల. పాలి గ్రామంలో ఈ ఆలయం కొలువుదీరి ఉంది. ఇక్కడి వినాయకుడు రాతి సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. తొండం ఎడమ వైపు తిరిగి తూర్పు వైపు త్రికోణంతో కనిపిస్తుంది.
ఈ ఆలయం 'శ్రీ' ఆకారంలో ఉంటుంది.
|| ఓం బల్లలేశ్వరాయ నమా ||
5.వరదవినాయక్
పుణె నుంచి 130 కిలోమీటర్ల దూరం మహాడ్ ప్రాంతంలో ఉంది ఈ గుడి. ఈ ఆలయ ఖోపోలి కి సమీపంలో ఉంది.ఈ విగ్రహం ఓ సరస్సులో దొరికిందని చెబుతారు. అక్కడ 18వ శతాబ్దం నుంచి వెలుగుతున్న ఒక చమురు దీపం వుంది.ఇక్కడ భక్తులు తమంతకు తాము పూజ నిర్వహించడానికి అనుగుణంగా ఉంటుందీ దేవాలయం.
|| ఓం వరదవినాయకాయ నమహా ||
6. చింతామణి
పుణె నుంచి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న తియూర్ గ్రామంలో కొలువుతీరాడు ఈ గణపయ్య. తూర్పు ముఖంగా ఉన్న వినాయకుడు భక్తులు ఏం కోరినా కరుణిస్తాడని చెబుతారు.
|| ఓం చింతమనీ నమహా ||
7. గిరిజాత్మజ మందిరం
పుణె నుంచి 97 కిలోమీటర్ల పరిధి ఉన్న లేయాంద్రి గ్రామంలో ఉంది గిరిజాత్మజ మందిరం. ఈ ఆలయం ఒకే రాయితో చెక్కి..దక్షిణ దిశగా ఉంటుంది.
|| ఓం గిరిజత్మజాయాయ నమహా ||
8. మహాగణపతి
పుణె నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంజనగావ్ లో కొలువుదీరింది ఈ ఆలయం. అత్యంత శక్తివంతమైన గణపతిగా చెబుతారు. త్రిపురాసురుడిని సంహరించేముందు శివుడు ఇక్కడ వినాయకుడిని ప్రార్థించాడని చెబుతారు. ఈ విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది.
|| ఓం మహానగతాయే నమహా ||
ఈ ఆలయాలన్నీ చూడడానికి రెండు రోజులు పడుతుంది. ఈ అష్టవినాయకులు దర్శించాలని అనుకునేవారు మొదట మోరేగావ్ లోని అష్టవినాయక మందిరాన్ని దర్శించుకుని ప్రయాణం మొదలుపెట్టాలి.
Also Read: బానపొట్ట, పెద్ద చెవులు, చిన్న కళ్లు -వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!
వినాయకుడి ఇతర ప్రసిద్ధ ఆలయాలు
ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం, కేరళలోని తిరుచిరాపల్లిలో ఉన్న ఉచ్చి పిళ్లైయారై కొట్టై, బీహార్ లోని బైద్యనాథ్ లో, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న వినాయక ఆలయం, వారణాసిలో ఉన్న ధుండిగజ్ మందిరం కూడా చాలా ప్రసిద్ధమైనవి.
Also Read: ఇలాంటి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తే ఇంట్లో వాస్తుదోషాలుండవ్, అన్నింటా సక్సెస్ అవుతారు!
విదేశాలలోనూ గణేషుడు
జావా, సుమత్రా, ఇండోనేషియాలను పూర్వం హిందూ రాజులే పాలించారని చెబుతారు. అందుకే అక్కడ భారీ స్థాయిలో హిందూ దేవతల ఆలయాలు బయటపడ్డాయి. వాటిలో వినాయకుని ఆలయాలే ఎక్కువ. తూర్పు జావాలోని ‘తులసికాయో’ అనే గ్రామంలో ఉన్న బారా దేవాలయంలో మూడు మీటర్ల ఎత్తున్న గణేశుడు కొలువు దీరాడు. థాయ్ లాండ్లోని బ్యాంకాక్ లో ఉన్న వినాయక ఆలయాన్ని ప్రతి శివరాత్రికి భారీగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు. మారిషస్, సింగపూర్ లలో కూడా బొజ్జగణపతికి గుడులు ఉన్నాయి. మెక్సికో, గ్వాటిమాలా, పెరూ, బొలీవియాలలో గణేశుడికి దేవాలయాలున్నాయి.