Mumbai: ముంబయి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు.. సెక్స్ చేయకుండా మహిళకు రెండేళ్ల నిర్బంధం!
ముంబయికి చెందిన ఓ నటిని రెండేళ్ల పాటు నిర్బంధంలో ఉంచాలని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అసలేమైంది?
ఓ మహిళను రెండేళ్ల పాటు నిర్బంధంలో ఉంచాలంటూ మేజిస్ట్రేట్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ముంబయి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెను వ్యభిచారం చేయకుండా నిలువరించేందుకే నిర్బంధంలో ఉంచనునట్లు కోర్టు పేర్కొంది.
ఏమైంది?
ముంబయిలో నివసిస్తోన్న ఓ మహిళ వ్యభిచారం చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆమెను ఆగస్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు హెచ్ఐవీ కూడా ఉన్నట్లు తేలింది. అనంతరం ఆమెను మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం ఆమెను రెండేళ్ల పాటు నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఎందుకంటే ఆమె వల్ల ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉందని కోర్టు తెలిపింది.
సెషన్స్ కోర్టులో..
అయితే పోలీసు అధికారిగా ఉన్న ఆమె తండ్రి ఈ తీర్పును సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. హెచ్‌ఐవీ ఉందన్న కారణంతోనే తన కూతుర్ని నిర్బంధంలో ఉంచారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమెన నిర్బంధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నంచారు. తన కూతుర్ని చూసుకునే స్థోమత తనకుందని ఆయన అన్నారు. బాధితులకు ఇష్టం లేకుండా నిర్బంధంలో ఉంచకూడదని బాంబే హైకోర్టు గతంలో ఓ మహిళ విషయంలో ఇచ్చిన తీర్పును కూడా తన పిటిషన్‌లో ఆయన ప్రస్తావించారు.
కోర్టు కీలక వ్యాఖ్యలు..
వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఆ మహిళను వ్యభిచారం నుంచి రక్షించారని కోర్టు పేర్కొంది. నిర్బంధం తప్పదని వ్యాఖ్యానించింది. బాధితురాలు హెచ్ఐవీతో బాధపడుతోందని.. లైంగిక సంపర్కం ద్వారా ఇది ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఇది సమాజానికి మంచిది కాదని పేర్కొంది. ఆమెను నిర్బంధంలో ఉంచి రక్షణ కల్పించడం ద్వారా మళ్లీ సాధారణ స్థితికి చేరుకొనే అవకాశం ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. కనుక దిగువ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోదలుచుకోలేమని అప్పీల్‌ను తిరస్కరించింది.
Also Read: UP Assembly Election 2022: 'ఓ మహిళా మేలుకో.. అభివృద్ధిని కోరుకో.. 40 శాతం టికెట్లు మహిళలకే'
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!