Chhattishgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 8 మంది మావోయిస్టులు మృతి
Chhattishgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు ఆందోళన కలిగించాయి. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోలు మృతి చెందారు.

Maoists Died In Chhattishgarh Encounter: ఛత్తీస్‌గఢ్ (Chhattishgarh) అటవీ ప్రాంతం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతుండగా.. ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అడవుల్లో మావోయిస్టులు కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇటీవలే ఛత్తీస్‌గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లోనే మావోయిస్టు మరో అగ్ర నేత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

