అన్వేషించండి

US Apple Telugu employees: తెలుగు వాళ్లపైనే తప్పుడు ప్రచారం - అమెరికా యాపిల్‌ కంపెనీలో ఇతర దేశాల వాళ్లకూ ఊస్టింగ్ - అసలు జరిగింది ఏమిటంటే ?

Apple: అమెరికా యాపిల్ కంపెనీలో నిధుల దుర్వినియోగం తెలుగువాళ్లు చేశారని వారి ఉద్యోగాలు తీసేశారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజం ఉంది ?

Matching grants scam in America Apple Company:  అమెరికాలో యూపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం చేసే తెలుగువారిలో కొంత మందిని తొలగించినట్లుగా రెండు, మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగగుతోంది. తెలుగువారి పరువు తీశారని..అదని ఇదని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో తెలుగు సంఘాలకు లింక్‌లు ఉన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఇది తెలుగువారు, తెలుగు సంఘాలతో కలిసి చేసిన స్కామ్ కాదు. యాపిల్‌లో చాలా  మంది ఉద్యోగులు ఇలాంటి అవకతవకలకు పాల్పడటంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అలాంటివారిలో కొందరు తెలుగువారు. 

మ్యాచింగ్ గ్రాంట్ ను దుర్వినియోగం చేశారని ఆరోపణలు !

యాపిల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా ఉద్యోగులకు సామాజిక సేవా కార్యక్రమాలకు కొన్ని నిధులు ఇస్తుంది. ఉద్యోగులు కూడా ఈ రెస్పాన్సిబులిటీ కింద కొంత మంది విరాళాలు ఇవ్వాలి. తాము కేటాయించే మొత్తానికి  యాపిల్ కంపెనీ ఇచ్చే మ్యాచింగ్ గ్రాట్ కలిపి లాభాపేక్ష లేని సేవా సంస్థలకు ఉద్యోగులు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా విరాళంగా ఇవ్వాల్సిన నిధుల్ని ఊరూపేరు లేని సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లుగా రికార్డులు సృష్టించి..తామే ఉంచుకున్నారన్నది ప్రధానంగా ఉద్యోగులపై ఆరోపణ. యాపిల్ ప్రధాన కార్యాలయంలో పని చేసే రెండు, మూడు వందల మందిపై ఇలాంటి అభియోగాలు రావడంతో ఆ కంపెనీ విచారణ జరిపింది. 

నిజమని తేలడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై క్రమశిక్షణా చర్లు

అంతర్గత విచారణలో  విషయం బయటకు రావడంతో ఉద్యోగులపై యాపిల్ కంపెనీ చర్యలు తీసుకుంది. స్వచ్చందంగా రాజీనామా  చేస్తారా లేకపోతే తీసివేయమంటారా అని ఆఫర్ ఇచ్చింది. ఫలానా ఆరోపణ కింద యాపిల్ కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకోవడం ఎందుకని చాలా మంది స్వచ్చందంగా రాజీనామా చేశారు. కొంత మందిని యాపిల్ కంపెనీ తొలగించింది. ఈ లే ఆఫ్‌లను ఆధారంగా చేసుకుని తెలుగువారిపై.. తెలుగు ఉద్యోగులపై ఇష్టం వచ్చినట్లుగా బురద చల్లేస్తున్నారు. 

Also Read: Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం

ఇటీవల ఫేస్ బుక్‌ సంస్థ తమ ఉద్యోగుల్లో కొంత మంది ఫుడ్ కూపన్‌లను దుర్వినియోగం చేశారని తొలగించింది. ఆఫీసులో  పనిచేస్తున్నప్పుడు క్యాంటిన్ లో ఇచ్చే భోజనం నచ్చకపోతే బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఫేస్‌బుక్ కూపన్లను ఇస్తుంది. ఈ కూపన్లను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉపయోగించుకున్నారని.. లేకపోతే దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఉద్యోగుల్ని తొలగించింది. ఇతర కంపెనీలు కూడా ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పుడు యాపిల్ కూడా అదే బాట పట్టింది. ఉద్యోగుల్ని తగ్గించుకునేందుకు ఏ తప్పులు చేస్తారా అని వెదికి ఇలా దొరికిన వారిని పంపేసింది. ఇందులో తెలుగు వారి కన్నా ఇతర దేశాల వారు ఎక్కువగా ఉన్నారు.కానీ తెలుగు వారిని తెలుగువారే కించపర్చేసుకుంటున్నారు. 

Also Read : Justin Trudeau: అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Breaking News: జనసేనకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ!
జనసేనకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ!
తక్కువ ధరలో SUV ఈవీని లాంచ్ చేయనున్న VinFast, ఈ కార్లకు గట్టి పోటీ తప్పదా ?
తక్కువ ధరలో SUV ఈవీని లాంచ్ చేయనున్న VinFast, ఈ కార్లకు గట్టి పోటీ తప్పదా ?
Bajaj Upcoming Dual Sport Motorcycle: బజాజ్ నుంచి సరికొత్త డ్యుయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్: లీకైన టెస్ట్ మ్యూల్ పిక్చర్స్.. అదిరిపోయే ఫీచర్లు
బజాజ్ నుంచి సరికొత్త డ్యుయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్: లీకైన టెస్ట్ మ్యూల్ పిక్చర్స్.. అదిరిపోయే ఫీచర్లు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
Embed widget