Mark Zuckerberg: ఏడాదిన్నర తరవాత కోడింగ్ ఉద్యోగాలుండవ్ - జాగ్రత్తపడండి - హింటిచ్చేసిన మార్క్ !
Coding Jobs: కోడింగ్ నేర్చుకోవడం దండగ అని.. మార్క్ జుకర్ బెర్గ్ చెప్పకనే చెబుతున్నారు. ఏడాదిన్నర తర్వాత కోడింగ్ ఉద్యోగాలన్నీ ఏఐనే చేస్తుందని చెబుతున్నారు.

Mark Zuckerberg says in 18 months coding will be done by AI: టెక్ రంగంలో వస్తున్న మార్పులు ఎవరూ ఊహించనివిగా ఉంటున్నాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 2025లో కోడింగ్ ఉద్యోగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. AI మిడ్-లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పనిని ఆటోమేట్ చేయగల సామర్థ్యానికి వచ్చేశాయని తెలిపారు. మరో ఏడాది తర్వాత ఏఐ కోడింగ్ పనులన్నీ చేస్తుందన్నారు.
వివిధ పాడ్‌కాస్ట్‌లలో 2025లో మెటాతో సహా పలు టెక్ కంపెనీలు మిడ్-లెవల్ ఇంజనీర్ స్థాయిలో కోడ్ రాయగల AIని అభివృద్ధి చేస్తాయని జుకర్ బెర్గ్ నమ్ముతున్నారు. 12-18 నెలల్ (అంటే 2026 మధ్య నాటి మెటా లామా ప్రాజెక్ట్‌లో ఎక్కువ కోడ్ AIతోనే పూర్తి అవుతుందని జుకర్ తెలిపాడు. కేవలం ఆటోకంప్లీట్ కాకుండా, లక్ష్యాలను సెట్ చేయడం, టెస్ట్‌లు నిర్వహించడం, బగ్‌లను కనుగొనడం , హై-క్వాలిటీ కోడ్‌ను రాయడం వంటివి ఏఐ చేయగలదని వివరించారు
AI ప్రస్తుతం ఒక టీమ్‌లోని "సగటు చాలా మంచి ఉద్యోగి " స్థాయిలో పనిచేయగలదని..నీ త్వరలో టాప్ కోడర్‌ల కంటే మెరుగ్గా పనితీరు ఉంటుందని ఉంటుందని జుకర్‌బర్గ్ విశ్లేషిస్తున్నార..ుు AI ఇప్పటికే కోడ్ యొక్క ఒక భాగాన్ని ఆటోకంప్లీట్ చేయగలదు. కానీ భవిష్యత్తులో ఇది స్వతంత్రంగా సంక్లిష్టమైన పనులను నిర్వహిస్తుందని జోస్యం చెబుతున్నారు. మిడ్-లెవల్ ఇంజనీర్లు మెటాలో సంవత్సరానికి సగటున 200,000 నుండి 500,000 డాలర్లు సంపాదిస్తారు. AI ఈ పనులను ఆటోమేట్ చేయడం ద్వారా కంపెనీలు గణనీయమైన ఖర్చులను ఆదా చేయవచ్చు ప్రారంభంలో AIని అమలు చేయడం ఖరీదైనది అయినప్పటికీ, సమయం గడిచే కొద్దీ ఇది మరింత తక్కువ ఖర్చుతో రూపొందించుకోవచ్చని జుకర్‌బర్గ చెబుతున్నార..ుు
AI కోడింగ్ ఉద్యోగాలను పూర్తిగా తొలగించదని, బదులుగా ఇంజనీర్లు , వ్యూహాత్మక ,సృజనాత్మక పనులపై దృష్టి పెట్టేలా చేస్తుందని జుకర్‌బర్గ్ చెబుతున్నారు. AI-జనరేటెడ్ కోడ్‌ను పర్యవేక్షించడం, ఆప్టిమైజ్ చేయడం , సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం వంటివి చేయవచ్చు. అంటే ఇంజనీర్లను "AI ట్రైనర్లు" లేదా "సిస్టమ్ ఆర్కిటెక్ట్‌లు"గా మార్చవచ్చని జుకర్ బెర్గ్ అంచనా.
2025 చివరి నాటికి అన్ని కోడ్ AI ద్వారా రాస్తారని 3-6 నెలల్లో 90 శాతం కోడ్ AI-జనరేటెడ్ అవుతుందని అంచనా వేశారు. పలువురు ప్రముఖులు ఇప్పటికే అంచనా వేశారు. 2025లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను నియమించుకోవడం గురించి తీవ్రంగా చర్చిస్తున్నామని, AI ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని అగ్రశేణి కంపెనీలు చెబుతున్నాయి. జుకర్‌బర్గ్ జనవరి 2025లో మెటాలో 5% సిబ్బందిని "లో-పెర్ఫార్మర్స్"గా పేర్కొంటూ తొలగించారు, ఇది AI ఆటోమేషన్‌తో సంబంధం ఉందని కొందరు ఊహించారు. AI సాధారణ కోడింగ్ పనులను ఆటోమేట్ చేయడం వల్ల ఎంట్రీ మరియు మిడ్-లెవల్ ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు
మార్క్ జుకర్‌బర్గ్ యొక్క అంచనా ప్రకారం, 2026 మధ్య నాటికి AI మెటాలో ఎక్కువ కోడింగ్ పనిని స్వతంత్రంగా నిర్వహిస్తుంది, ఇది మిడ్-లెవల్ ఇంజనీర్ల ఉద్యోగాలను ప్రభావితం చేయవచ్చు. అందుకే కోడింగ్ కెరీర్ ఎంచుకోవాలనుకున్న వాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.





















