అన్వేషించండి

Revanth Reddy Comment On caste census: కాంగ్రెస్ ఒత్తిడి, నితీష్‌ వెళ్లిపోతారనే భయంతో దిగొచ్చిన మోదీ- కులగణన నిర్ణయంపై రేవంత్ కామెంట్స్ 

Revanth Reddy Comment On caste census: కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఈ విషయంలో మాత్రం దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు.

Revanth Reddy Comment On caste census: కాంగ్రెస్ నినాదం, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మోడల్‌, బిహార్‌లో ఉన్న రాజకీయ అవసరాల కోసమే కేంద్రం కులగణనకు ఓకే చెప్పిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు కులగణన చేయబోమని కోర్టుల్లో అఫిడవిట్‌లు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఒత్తిడే ఎక్కువ ఉందని చెప్పుకొచ్చారు. అడుగడగునా వెంటాడిన కాంగ్రెస్‌, ఈ నిర్ణయం మోదీ తీసుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. దీనికి తోడు తెలంగాణ చేపట్టిన సర్వే కూడా కేంద్రానికి మోడల్‌గా మారిందని వివరించారు. 

రాహుల్‌కు ధన్యావాాదాలు తెలిపిన రేవంత్

దేశవ్యాప్తంగా జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ప్రజల గుండెచప్పుడు విన్నారని రేవంత్ అన్నారు. అందుకే కులగణన చేస్తామని హామీ ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారని వెల్లడించారు. రాహుల్ సూచనలతోనే తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని వివరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి ధన్యావాదాలు తెలియజేశారు.  

"కేంద్రానికి రెండు తీర్మానాలు"

తెలంగాణ అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని సీఎం గుర్తు చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగించాలని తీర్మానం పంపించిన విషయాన్ని ప్రస్తావించారు. జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టామని వెల్లడించారు. తమ ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.  

"ఎక్కడా పార్టీ కార్యక్రమంలా చేయలేదు"

జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్నా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణనకు అనుసరించే విధానాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని సూచించారు. ఇందుకు కేంద్రమంత్రులతో కూడిన కమిటీతోపాటు, అధికారులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కులగణన చేపట్టే క్రమంలో తెలంగాణ విధి విధానాలు రూపొందించి ప్రజల ముందు పెట్టామని తెలిపారు. తెలంగాణలో 57 ప్రశ్నలతో 8 పేజీలతో కూడిన సమాచారాన్ని సేకరించామని వివరించారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేశామని అన్నారు. ఎక్కడా పార్టీ కార్యక్రమంలా చేయలేదన్నారు. 

"దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచాం"

అందరినీ భాగస్వామ్యంతో తెలంగాణలో కులగణన పూర్తి చేశామన్నారు రేవంత్ రెడ్డి. కులగణనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచిందన్నారు. దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా నిలిచిందని వెల్లడించారు. కులగణనపై కేంద్రంతో తమ అనుభవాన్ని పంచుకోవడానికి ఎలాంటి భేషజాలు లేవని ప్రకటించారు. బలహీన వర్గాలకు మేలు జరగాలనేదే తమ సంకల్పమని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం కులగణన చేసించూపించిందన్నారు. 

"బీజేేపీ నేతలకు అదే అసూయ"

విమర్శలు చేసే బీజేపీ నేతలకు కొన్ని ప్రశ్న సంధించారు రేవంత్ రెడ్డి. పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదని అడిగారు. రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోసమే విమర్శలు చేస్తున్నారన్నారు. స్థానిక బీజేపీ నాయకుల్లో అసూయ, అసంతృప్తి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ వారిలో ఉందన్నారు. వాళ్లు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ అని పునరుద్ఘాటించారు. 

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget