By: ABP Desam | Updated at : 11 Jun 2022 11:43 AM (IST)
అమెరికా ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్
చైనా ల్యాబ్ నుంచే కరోనా లీక్..!
రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని ముప్ప తిప్పలు పెడుతోంది కరోనా. తగ్గినట్టే తగ్గి మళ్లీ వేవ్‌ల రూపంలో విరుచుకుపడుతోంది. ఒక్కోసారి రోజువారీ కేసులు పదుల సంఖ్యకు పడిపోతుంటే మరి కొన్నిసార్లు వందలు, వేలు నమోదవుతున్నాయి. ఎప్పుడు ఎలా వ్యాప్తి చెందుతుందో అర్థం కావట్లేదు. ఇప్పటికే దశలవారీగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థని దెబ్బ తీసింది ఈ వైరస్. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయనుకునే లోపే మరో వేవ్ వచ్చి ఇబ్బందులు పెడుతోంది. ఈ వైరస్ వ్యాప్తి, మూలాలపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చైనాలోని వుహాన్ నుంచి వ్యాప్తి చెందింది కరోనా వైరస్. అందుకే ఈ వైరస్‌కు మూలం చైనాయే అనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. డ్రాగన్ దేశం ఓ ల్యాబ్‌లో వైరస్‌ను పుట్టించి కావాలనే లీక్ చేసిందన్న ఆరోపణలూ తీవ్రంగానే వచ్చాయి. మొదటి నుంచి ఈ విమర్శల్ని తిప్పి కొడుతూ వచ్చింది చైనా. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటంపై మండిపడుతోంది.
అమెరికా ల్యాబ్‌ల్లోనూ విచారించండి: చైనా
కరోనా మూలాలపై స్పష్టత లేనప్పటికీ కచ్చితంగా ల్యాబ్ నుంచే లీక్ అయుండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పటంపై చైనా కాస్త ఘాటుగానే స్పందించింది. పూర్తి స్థాయి విచారణ జరపకుండానే ల్యాబ్ నుంచే లీక్ అయిందని ఎలా తేల్చి చెబుతారని అసహనం వ్యక్తం చేస్తోంది చైనా. రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అంటోంది. ల్యాబ్ నుంచి లీక్ అయిందో లేదో తేల్చేందుకు విచారణ జరిపింది డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం. ఆ సమయంలో చైనా సరైన విధంగా సహకరించలేదని అప్పట్లో చాలానే విమర్శలు వచ్చాయి. ఈ విషయమై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ స్పష్టతనిచ్చారు. తమ ప్రతిష్ఠను దిగజార్చేందుకే కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిపుణుల బృందానికి పూర్తిస్థాయి సహకారం అందించామని వెల్లడించారు. కేవలం చైనా వైపే
వేళ్లు చూపించటం సరికాదని, అమెరికాలోనూ కొన్ని ల్యాబ్స్‌పై తమకు అనుమానం ఉందని అన్నారు లిజియన్. ఫోర్ట్ డెట్రిక్, యూనివర్సిటీ నార్త్ కరోలినా ల్యాబ్స్ నుంచే కరోనా లీక్ అయుండొచ్చని చైనా అమెరికాపై ఆరోపణలు చేస్తోంది. బయోవార్‌లో భాగంగా అగ్రరాజ్యం ఈ పని చేసుండొచ్చని అంటోంది డ్రాగన్ దేశం. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇంకా కీలకమైన సమాచారం లభించాల్సి ఉందని ప్రకటించింది. ఈ వివరాలు అందించకుండా చైనా దాస్తోందని అంటున్నారు డబ్ల్యూహెచ్‌వోసలహాదారులు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవటంతోనే కాలమంతా గడిచిపోతోంది తప్ప కరోనా మూలాలు ఎక్కడ అనే నిజం మాత్రం ఇంకా తేలటం లేదు.
Pankaja Munde: నేను బీజేపీలో ఉన్నాను, కానీ ఇది నా పార్టీ కాదు: మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే
Gold Smuggling: శ్రీలంక నుంచి భారత్ కు బంగారం తరలింపు - నడిసంద్రంలో 32 కిలోల గోల్డ్ సీజ్
IITM: పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!
Weirdest Job: పక్షులను తోలడమే అక్కడ పని- కొన్ని రోజులు ఈ ఉద్యోగం చేస్తే చాలు లక్షాధికారి కావొచ్చు!
IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
గోల్కొండ కోటపై తెలంగాణ అవతరణ వేడుకలు- జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?
వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!