King Charles Coronation: కింగ్ ఛార్లెస్‌ను ఇంప్రెస్ చేసిన బెంగాలీ అమ్మాయి, పట్టాభిషేకానికి స్పెషల్ డ్రెస్ డిజైన్
King Charles Coronation: కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకానికి బెంగాలీ డిజైనర్ స్పెషల్ డ్రెస్ డిజైన్ చేసింది.
King Charles Coronation:
డ్రెస్ డిజైన్ చేసిన ప్రియాంక..
మే 6వ తేదీన బ్రిటన్ కింగ్ ఛార్లెస్ -III పట్టాభిషేకానికి (King Charles III Coronation) అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో ప్రతిదీ స్పెషలే. మునుపటిలా ఘనంగా సెలబ్రేట్ చేయకపోయినా...ఉన్నంతలో భారీగానే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో హైలైట్ ఏంటో తెలుసా..? కింగ్ చార్లెస్ (King Charles III), ఆయన సతీమణి క్వీన్ కన్సార్ట్ కమిల్లా (Queen Consort, Camilla) వేసుకునే డ్రెస్‌లు. మరి పట్టాభిషేకం అంటే డ్రెసింగ్ ఓ రేంజ్‌లో ఉండాలి. డిజైన్‌లు అదిరిపోవాలి. చూపు తిప్పనివ్వకుండా ధగధగ మెరిసిపోవాలి. ఇంత అద్భుతంగా ఉండాలంటే...అంతే అద్భుతమైన డిజైనర్ చేతిలో అవి తయారవ్వాలి. కింగ్ ఛార్లెస్‌కి అలాంటి డిజైనరే దొరికింది. మరో స్పెషల్ ఏంటంటే...ఆ డిజైనర్ మన ఇండియనే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 29 ఏళ్ల ప్రియాంక మల్లిక్ (Priyanka Mallick) కింగ్ ఛార్లెస్ డ్రెస్‌లను డిజైన్ చేసింది. అంతే కాదు. రాయల్ హౌజ్ నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. "కింగ్ ఛార్లెస్ డ్రెస్‌ని అందంగా,అద్భుతంగా తీర్చి దిద్దినందుకు ధన్యవాదాలు" అంటూ ప్రియాంకకు అధికారికంగా మెయిల్ పంపింది రాయల్ హౌజ్. కింగ్ కోసం butterfly brooch డిజైన్ డ్రెస్‌ని తయారు చేసింది ప్రియాంక. ఇక క్వీన్ కన్సార్ట్ కమిల్లా కోసం గులాబీ పూలతో డిజైన్ చేసిన రెడ్ కలర్ డ్రెస్‌ని డిజైన్ చేసింది. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రముఖులు హాజరయ్యే ఆ ఈవెంట్‌లో ఇవే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి.
(Image Credits: Getty)
View this post on Instagram
పట్టాభిషేకానికి ఆహ్వానం..
ప్రియాంకకు అప్రిషియేషన్ లెటర్‌తో పాటు పట్టాభిషేక కార్యక్రమానికి హాజరు కావాలని రాయల్ హౌజ్ ఆహ్వానం పలికింది. 29 ఏళ్ల ప్రియాక మల్లిక్ కోల్‌కత్తాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుగ్లీలో జన్మించింది. ఇటలీలోని మిలాన్, హార్వర్డ్‌తో పాటు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో డిగ్రీలు చేసింది. యూకేకి చెందిన Royal Commonwealth Societyలో మెంబర్ కూడా. కింగ్ ఛార్లెస్ ధరించే డ్రెస్‌కి చాలా ప్రత్యేకత ఉంటుంది. అది వాళ్ల చరిత్రకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తారు. దీన్నే "coronation robes" అంటారు. ఇందులో ప్రతి డిజైన్‌కి ఓ అర్థం, చరిత్ర ఉంటుంది. ఈ డ్రెస్‌ని వెల్వెట్‌తో తయారు చేశారు. గోల్డ్ లేస్‌లు, ఎంబ్రాయిడరీతో అందంగా తీర్చి దిద్దారు. వీటికి అదనపు ఆకర్షణగా కొన్ని ఆభరణాలనూ అద్దుతారు. వైట్ కలర్ సిల్క్ కోట్‌పై ఈ డ్రెస్‌ను వేసుకుంటారు. ఇది స్వచ్ఛతకు ప్రతీక అని రాయల్ ఫ్యామిలీ భావిస్తుంది. ఆ డ్రెస్‌పై దుపట్టా (Stole) వేసుకుంటారు. దీన్ని బంగారు తీగలతో తయారు చేస్తారు. దీనిపై దేవతల బొమ్మలు ముద్రిస్తారు. చేతులకు గ్లోవ్స్ వేసుకుంటారు కింగ్ ఛార్లెస్. వీటిని కూడా బంగారు తీగలతోనే తయారు చేస్తారు. ఇలా ప్రతి ఒక్క డిజైన్ వాళ్ల రాయల్టీని ప్రతిబింబిస్తుంది. కింగ్ డ్రెస్‌ని తీర్చిదిద్దడంపై ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Google Sign-in: పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ అయిపోవచ్చు, గూగుల్ కొత్త ఫీచర్ అదుర్స్