By: Ram Manohar | Updated at : 04 May 2023 03:47 PM (IST)
పాస్‌వర్డ్‌లతో పని లేకుండానే లాగిన్ అయ్యేలా గూగుల్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.
Google Sign-in:
పాస్‌వర్డ్‌తో పని లేదు..
"అబ్బబ్బా...ఈ పాస్‌వర్డ్‌లు గుర్తు పెట్టుకోవడం కన్నా కష్టమైన పని ఇంకోటి ఉండదు. అసలు పాస్‌వర్డ్‌లతో పని లేకుండా నేరుగా లాగిన్ అయ్యే ఫెసిలిటీ వస్తే బాగుండు". అందరికీ కాకపోయినా..మతిమరుపు రాయుళ్లకు ఇలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది. ఇలాంటి వాళ్ల బాధను అర్థం చేసుకుందో ఏమో కానీ...గూగుల్ (Google Account) కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. పాస్‌వర్డ్‌తో పని లేకుండానే లాగిన్ అయ్యేలా మార్పులు చేర్పుల చేయనుంది. వెబ్‌సైట్‌తో పాటు యాప్ వర్షన్‌లోనూ ఈ ఫీచర్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించింది. అదెలా..? పాస్‌వర్డ్ లేకుంటే డేటా ఎలా సెక్యూర్డ్‌గా ఉంటుంది..? అనే సందేహాలు రావడం సహజం. అయితే...దీనికీ గూగుల్ వివరణ ఇచ్చింది. పాస్‌వర్డ్‌లు కాకుండా పాస్‌కీస్‌తో (Passkeys) లాగిన్ అయ్యేలా మార్పు చేయనుంది. గూగుల్ అకౌంట్స్ అన్నింటికీ ఈ పాస్‌కీస్ అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ యూజర్స్ పాస్ కీస్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. లాగిన్ అయ్యేటప్పుడు పాస్‌వర్డ్ కానీ...2 స్టెప్ వెరిఫికేషన్ ( 2-Step Verification) కానీ అడగదు. గూగుల్‌తో పాటు యాపిల్, మైక్రోసాఫ్ట్ కూడా ఇదే తరహా లాగిన్‌కి మొగ్గు చూపుతున్నాయి.
పాస్ కీస్ అంటే ఏంటి..?
పాస్‌వర్డ్స్, టూ స్టెప్ వెరిఫికేషన్ కన్నా పాస్‌కీస్ చాలా సేఫ్ అని గూగుల్ చెబుతోంది. పాస్‌కీస్ రిజిస్టర్ అయ్యున్న ప్రతి డివైజ్‌లోనూ ఈ ఫీచర్ పని చేస్తుంది. అన్ని బ్రౌజర్‌లలోనూ వినియోగించుకోవచ్చు. కంప్యూటర్, మొబైల్ ఇలా...ఏ డివైస్‌ని అయినా సింపుల్‌గా అన్‌లాక్ చేసుకోవచ్చు. ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ లేదా PIN ద్వారా లాగిన్ అవ్వచ్చు. పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడం పెద్ద ప్రహసనం. అందులోనూ స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు (Strong Passwords) సెట్ చేసుకోవడం, వాటిని గుర్తు పెట్టుకోవడం మరింత కష్టం. పైగా...ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మెల్లగా మాటల్లోకి దింపి పాస్‌వర్డ్‌లు అడిగి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టనున్నాయి పాస్‌కీస్. ఇక 2 స్టెప్ వెరిఫికేషన్‌తోనూ మోసాలు జరుగుతున్నాయి. సిమ్ స్వాప్ చేసి సింపుల్‌గా ఆ కోడ్‌తో లాగిన్ అయిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. పాస్‌కీస్ ఇలాంటి సమస్యలు పరిష్కారం చూపించనుంది. ఇవి కేవలం మన డివైస్‌కి మాత్రమే పరిమితమవుతాయి. వాటిని ఎక్కడా రాసుకోడానికి కానీ...ఎవరికో చెప్పడానికి కానీ వీలుండదు. సింపుల్‌గా చెప్పాలంటే నేరుగా ఫింగర్‌ప్రింట్‌తో లేదా ఫేస్ ఐడీతో లాగిన్ అయిపోవచ్చు. అలాంటప్పుడు మీరు తప్ప మరెవరూ ఆ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వలేరు. నిజానికి 2009లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినా...అమలు చేయలేదు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరుగుతుండటం వల్ల మరోసారి దీనిపై చర్చ జరుగుతోంది. అందుకే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగుల్ ప్రకటించింది.
ఏం చేయాలి..?
1. ముందుగా కంప్యూటర్‌లో కానీ మొబైల్‌లో కానీ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. g.co/passkeys సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ గూగుల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
2. లాగిన్ అయిన వెంటనే కొన్ని పాస్‌కీస్ సజెషన్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఆటో జెనరేటెడ్ పాస్‌కీస్. Use Passkey బటన్‌పై క్లిక్ చేయాలి. బయోమెట్రిక్ ద్వారా కానీ లేదంటే PIN ద్వారా కానీ మీ ఐడెంటిటీని కన్‌ఫమ్ చేయాలి.
3. ఓసారి వెరిఫికేషన్ పూర్తైన తరవాత పాస్‌కీస్ ఎనేబుల్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఇకపై ఆ పాస్‌కీస్‌తోనే లాగిన్ అవ్వచ్చు. ఏ డివైజ్‌లో అయినా ఈ ఫీచర్‌తో లాగిన్ అవ్వడానికి వీలుంటుంది.
Also Read: Rat Bite: సినిమా చూస్తుండగా కొరికిన ఎలుక, థియేటర్‌పై కంప్లెయింట్ - ఫైన్ వేసిన కోర్టు
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో ఎలక్ట్రానిక్ డివైజ్ వాడిన ముగ్గురు అరెస్ట్
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి
Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Errabelli Dayakar Rao: త్వరలో బీసీ కుల వృత్తుల వారికి రూ.1లక్ష చొప్పున ఆర్థిక సహకారం: మంత్రి ఎర్రబెల్లి
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!