అన్వేషించండి

Massive encounter in Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్- 10 మంది మావోయిస్టుల మృతి - అగ్రనేతల హతం ?

Chattisgarh: చత్తీస్‌ఘడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు పార్టీ కీలక నేతలు హతమయ్యారు . మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ (CC) సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఉన్నట్లు గుర్తించారు.

Key Maoist party leaders killed:   ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మ జిల్లా గరియాబాద్ లో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టు లు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మనోజ్ కూడా అలియాస్ మొడెం బాలకృష్ణ తో పాటు ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు SZCM ప్రమోద్ అలియాస్ పాండు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. 10 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయాని గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపారు. ఉదయం నుండి భద్రతా దళాలు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. థానా మెయిన్‌పూర్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గరియాబంద్ E30, STF, COBRA బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను మొదలుపట్టాయి. ఇప్పటివరకు 10 మృతదేహాలను ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మృతుల్లో ఎవరెవరు ఉన్నారనేది  అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు
  
గరియాబంద్ జిల్లా SP నిఖిల్ రఖేచా ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్ సెప్టెంబర్ 11, 2025 ఉదయం నుంచి మైన్‌పూర్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో జరిగింది. మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారని నిర్దిష్టమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఈ-30 యూనిట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) యొక్క కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఈ ఆపరేషన్ సెప్టెంబర్ 10, 2025 రాత్రి నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 11 ఉదయం తీవ్రమైన కాల్పులతో ఉధృతమైంది.

"ఈ ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలు మావోయిస్టులతో భీకర కాల్పులు జరిపాయి. ఇప్పటివరకు 10 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము,  పలు ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నాము," అని  బలగాల ఉన్నతాధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో AK-47లు, ఇన్సాస్ రైఫిల్స్, SLRలు,  ఇతర ఆధునిక ఆయుధాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.మావోయిస్టు సీనియర్ కమాండర్ మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఈ ప్రాంతంలో ఉన్నాడని నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. బాలకృష్ణ ఒక కీలక మావోయిస్టు నాయకుడిగా పరిగణించబడతాడు. అతని సమక్షంలో ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు ఊపందుకున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో అతనితో పాటు ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా మృతి చెందినట్లు అనధికారిక సమాచారం ఉంది, అయితే ఈ విషయంపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.                         
  
ఈ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడానికి భద్రతా బలగాలు చేస్తున్న ప్రయత్నంలో మరో ముందడుగు.  2025లో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 225 మంది మావోయిస్టులు వివిధ ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి, ఇందులో బస్తర్ డివిజన్‌లో 208 మంది ఉన్నారు.                      

 

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget