Bastar: దశాబ్దాల నక్సల్స్ అడ్డా బస్తర్ -ఇప్పుడు నక్సల్ ఫ్రీ ప్రాంతం - కేంద్రం సంచలన ప్రకటన
Bastar Naxals: నక్సల్స్ రహిత ప్రాంతంగా బస్తర్ ను చత్తీస్ ఘడ్ ఐజీ ప్రకటించారు. బస్తర్ అంటే.. నక్సలైట్ల కంచుకోట.కానీ ఇప్పుడు నక్సలైట్లే లేరని ప్రకటించారు.

Bastar as a Naxal-free area : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎల్‌డబ్ల్యూఈ (లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) జిల్లాల జాబితా నుండి తొలగించింది, దీనిని నక్సల్‌వాదం నుండి విముక్తి పొందిన జిల్లాగా ప్రకటించారు. బస్తర్‌లో దశాబ్దాలుగా నడుస్తున్న నక్సల్ సమస్యకు ముగింపు పలికినట్లయింది. బస్తర్ జిల్లా ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రముఖ జిల్లా, దీని కేంద్రం జగదల్‌పూర్. ఈ ప్రాంతం గ నక్సలైట్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతంలో గిరిజన సంస్కృతి , ఒడిశా సంస్కృతి కలగలిసిన ప్రత్యేకత ఉంటుంది.
గత ఒకటిన్నర సంవత్సరాలుగా బస్తర్ ప్రాంతంలో నక్సల్‌వాదాన్ని అరికట్టడానికి కేంద్ర బలగాలు , రాష్ట్ర పోలీసులు సమన్వయంతో పనిచేశాయని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రకటించారు. నిషేధిత సీపీఐ-మావోయిస్ట్ సంస్థకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యకలాపాల ఫలితంగా బస్తర్ , ఇతర ప్రాంతాలలో నక్సల్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయ బస్తర్ ఐజీ పి. సుందర్‌రాజ్ గతంలో ప్రకటించారు. బస్తర్ ఉపవిభాగంలోని బిజాపూర్, సుక్మా, నారాయణపూర్, మరియు దంతేవాడ జిల్లాల్లో కూడా నక్సల్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బస్తర్ జిల్లాను నక్సల్ ప్రభావిత జిల్లాల జాబితా నుండి తొలగించడం ద్వారా దీనిని అధికారికంగా నక్సల్ రహితంగా ప్రకటించినట్లయంది. ఈ నిర్ణయం ప్రాంతంలో శాంతి, సాధారణ జనజీవనం పునరుద్ధరణకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడం వల్ల స్థానిక జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుందని, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని అధికారులు ఆశిస్తున్నారు. 2025 మార్చిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సవరించిన నక్సల్ ప్రభావిత జిల్లాల జాబితాలో బస్తర్, రాజ్‌నందగావ్, కొండగావ్ వంటి జిల్లాలను "లెగసీ అండ్ థ్రస్ట్ డిస్ట్రిక్ట్స్"గా గుర్తించారు. అనతికాలంలోనే నక్సల్స్ లేకుండా ఎలా చేశారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
#WATCH | Chhattisgarh: IG Bastar P Sundarraj says, "As a result of carrying out operations against the banned and illegal CPI-M outfit, Naxal activity in Basatar and many regions of India has reduced significantly... 4 districts of Bastar sub-division, Bijapur, Sukma, Narayanpur,… pic.twitter.com/SmmiYXAGXs
— ANI (@ANI) May 28, 2025
బస్తర్ ప్రాంతంలో నక్సలైట్లు నిజంగా అంతమైపోతే అభివృద్ధి, పర్యాటకం, మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కొత్త అవకాశాలను తెరవవచ్చని చెబుతున్నారు. నక్సల్స్ సమస్య వల్ల బస్తర్ ఎదుర్కొన్న సమస్యలపై సినిమాలు కూడా వచ్చాయి.
Bastar the Naxal story
— Right Singh (@rightwingchora) March 15, 2024
the film portrayed the facts about how these Naxalites, armed with guns in the jungle, and urban Naxals in the city, plan to undermine the sovereignty of India.
It depicts the grim reality of how they murder innocent villagers and tribals if they don’t… pic.twitter.com/zmYI1qulMF





















