అన్వేషించండి

Civil Mock Drill: సరిహద్దుల్లో ఉద్రిక్తత, భారత్‌లో గురువారం మరోసారి సివిల్ మాక్ డ్రిల్: కేంద్రం కీలక నిర్ణయం

Civil Defence Mock Drill : ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన మూడు వారాల తరువాత దేశంలో మరోసారి సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కెేంద్రం నిర్ణయం తీసుకుంది.

Civil Mock Drill In 4 states | న్యూఢిల్లీ: కాల్పుల విరమణ అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అదుపులోకి వచ్చాయి. కానీ పాక్ కుయుక్తులను తిప్పి కొట్టేందుకు భారత్ రెడీగా ఉంది. ఇటీవల ఓసారి సివిల్ మాక్ డ్రిల్ సైతం చేపట్టి పౌరులకు అవగాహనా కల్పించింది కేంద్రం. మరోసారి సివిల్ మాక్ డ్రిల్ చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల చేపట్టినట్లు దేశ వ్యాప్తంగా కాకుండా కేవలం పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న 4 రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. మాక్ డ్రిల్ సమయంలో కరెంట్ సరఫరా నిలిపివేస్తారు.

పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ 

మే 29న (గురువారం నాడు)  జమ్మూ కాశ్మీర్‌ల, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో గురువారం సాయంత్రం సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ముందు భారత్‌లో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో, ఏపీలోని విశాఖపట్నంలో, తెలంగాణలోని హైదరాబాద్‌లోనూ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. 

పాక్ సైన్యం దాడులు ఓ వైపు, ఉగ్రవాదుల కుట్రలు మరోవైపు భారత్‌కు ప్రమాదంగా మారుతున్నాయి. దాంతో ప్రజలను ఎప్పటికప్పుడూ సైన్యం చేస్తున్న సన్నద్ధత, పౌరులకు అవగాహన కల్పించడం కోసం పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో మే 29న సాయంత్రం మాక్ డ్రిల్‌ చేపడతారు. 

ఉగ్రవాదంపై పోరుకు ఆపరేషన్ సిందూర్

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఓ నేపాలీ సహా 26 మంది అయామకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారణంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టింది. అంతా ప్లాన్ చేసుకుని మే 6, 7 తేదీలో రాత్రి భారత్ పాకిస్తాన్‌పై 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. దానికి ముందే దేశంలోని 244 జిల్లాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ జరిగాయి. వీటిలో చాలా వరకు యుద్ధ సమయంలో ఎలా స్పందించాలో, ముప్పునకు గురయ్యే  పరిస్థితుల్లో ఎలా బయట పడాలో పౌరులకు అవగాహన కల్పించారు.

సివిల్ మాక్ డ్రిల్స్

శత్రు దాడుల సమయంలో, ఇతర అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పౌరులను సంసిద్ధం చేయడం. వారికి అవగాహనా కల్పించడంతో పాటు అత్యవసర సమయంలో స్పందించాల్సిన పద్ధతులపై అలర్ట్ చేయడం ఈ సివిల్ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. ఆ సమయంలో ఎయిర్ సైరన్‌ల మోత వినిపిస్తుంది, స్థానిక అత్యవసర సేవలు,  సమన్వయంతో  స్పందించడం వంటివి  ఉంటాయి. 1971లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కానీ 1999లో కీలకమైన కార్గిల్ యుద్ధం సమయంలో పౌర రక్షణ డ్రిల్స్ నిర్వహించలేదు. ఇటీవల మే 7వ తేదీన సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించి పౌరులకు వీటిపై అవగాహనా కల్పించడంతో పాటు యుద్ధ వాతావరణం సమయంలో పాటించాల్సినవి తెలిసేలా చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.          

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget