Kangana Ranaut Update: 'నా వాహనంపై రైతులు దాడి చేశారు.. చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు'
తన వాహనంపై రైతులు దాడి చేసినట్లు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వాహనంపై దాడి జరిగింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వెళ్తుండగా కొందరు రైతులు తన వాహనంపై దాడి చేసినట్లు కంగనా ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తనపై దుర్భాషలాడినట్లు, చంపేస్తానని బెదిరించినట్లు కంగనా ఆరోపించారు.
Punjab | Farmers stopped actor Kangana Ranaut’s car near Ropar & protested against her over her statements on farmers protest
— ANI (@ANI) December 3, 2021
"If the police personnel were not present here, lynching would've happened, shame on these people," says Kangana Ranaut pic.twitter.com/Rd37EQfpfT
సాగు చట్టాలపై రైతులు చేసిన ఉద్యమంపై ఇటీవల కంగనా రనౌత్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటన చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భారత్‌ను 'జిహాదిస్ట్ నేషన్' అని పిలిచారు. సిక్కులను 'ఖలిస్థానీలు'గా కంగనా పిలిచారు.