అన్వేషించండి

Budget 2025: బడ్జెట్‌ బృందానికి ఎక్కువ జీతం ఇస్తారా! - లాక్‌డౌన్‌లో ఉన్నందుకు ఎలాంటి రివార్డ్‌లు లభిస్తాయి?

India Budget 2025: బడ్జెట్ బృందం పని సవాళ్లతో కూడి ఉంటుంది, గోప్యంగా జరుగుతుంది. అందువల్ల, బడ్జెట్ బృందం బయటి వ్యక్తులతో మాటలకు దూరంగా ఉంటుంది.

Rewards to budget making team: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) 01 ఫిబ్రవరి 2025న, 2025-26 ఆర్ఖిక సంవత్సరం (Financial Year 2025-26) కోసం కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ మోదీ ప్రభుత్వానికి 14వ బడ్జెట్‌. 

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాతి పరిస్థితుల గురించి చాలా మంది ప్రజలకు తెలుసుగానీ, బడ్జెట్‌ సమర్పించే ముందు ఏం జరుగుతుందో ఎక్కువ మందికి తెలీదు. బడ్జెట్ సిద్ధం చేసేందుకు ఒక ప్రత్యేక బృందం ఉంటుంది, వాళ్ల పని ఎంత సవాళ్లతో కూడుకున్నదో ప్రజలు తెలుసుకోవాలి. వాస్తవానికి, బడ్జెట్ తయారీ అనేది కేవలం ఒక రోజు పని కాదు, రోజుల తరబడి సాగే సంక్లిష్టమైన ప్రక్రియ ఇది. దీనిలో అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం ఏర్పడాలి.

బడ్జెట్‌ తతంగం మొత్తం పూర్తి గోప్యం
బడ్జెట్‌ను సిద్ధం చేసే బృందానికి ఉన్న బాధ్యత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, బడ్జెట్ అనేది దేశ ఆర్థిక దిశను & ప్రజల కోసం ప్రభుత్వ పథకాల రూపురేఖలను నిర్ణయిస్తుంది. బడ్జెట్ తయారీ పని అత్యంత గోప్యంగా సాగుతుంది. ప్రభుత్వ అధికారులు, బడ్జెట్ బృందం సభ్యులు అన్ని ముఖ్యమైన గణాంకాలు, అంచనాలు, ప్రణాళికల గురించి పూర్తి మౌనంగా ఉంటారు. ఈ సమయంలో, మీడియాతో మాట్లాడటానికి లేదా బయటి వ్యక్తులతో చర్చించడానికి వాళ్లకు అనుమతి ఉండదు. 

నార్త్‌ బ్లాక్‌లో లాక్‌డౌన్‌ 
కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు బడ్జెట్‌లోని ప్రతి అక్షరం, ప్రతి అంశం రహస్యంగా ఉండాలి. ఈ కారణంగా, బడ్జెట్‌ టీమ్‌ను బాహ్య ప్రపంచం నుంచి విడదీసి 'నార్త్‌ బ్లాక్‌' ‍‌(North Block)లో లాక్‌డౌన్‌ చేస్తారు. ఒక విధంగా, వాళ్లను 'జైలు తరహా వాతావరణం'లో ఉంచుతారు. నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌లో బడ్జెట్‌ పేపర్ల ప్రింటింగ్‌ జరుగుతుంది. బడ్జెట్‌ ప్రింటింగ్‌ కాలంలో, బడ్జెట్‌తో సంబంధం ఉన్న అందరు అధికారులు & సిబ్బంది ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాంగణాన్ని వదిలి వెళ్ళడానికి అనుమతి లేదు. పార్లమెంటులో బడ్జెట్‌ పేపర్లను సమర్పించే వరకు వాళ్లు అక్కడే ఉండాలి. వాళ్లకు - బాహ్య ప్రపంచానికి సంబంధాలు కట్‌ అవుతాయి, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా వీలుండదు. వాళ్ల నుంచి మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు వంటివి కూడా మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ప్రింటింగ్‌ పూర్తయ్యే వరకు వాళ్లందరిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కన్నేసి ఉంచుతుంది. సమర్పణకు ముందే బడ్జెట్‌ లీక్‌ కాకుండా చూసేందుకే ఈ కట్టడి చర్యలు.

బడ్జెట్ తయారీ బృందానికి ఎక్కువ జీతం లభిస్తుందా?
బడ్జెట్‌ సమయం ఆసన్నమైనప్పుడల్లా, బడ్జెట్ తయారీ బృందంలోని ఉద్యోగులు ఎక్కువ జీతం పొందుతారా అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. బడ్జెట్ బృందానికి ఎక్కువ జీతం లభించదు, సాటి ఉద్యోగులు పొందే జీతమే వాళ్లూ తీసుకుంటారు. అయితే, బడ్జెట్‌ తయారీలో పాలు పంచుకున్నందుకు ప్రత్యేక రివార్డులు & ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, బడ్జెట్ తయారీ పని అనేది విధుల్లో ఒక భాగంగా & దేశ సేవగా పరిగణిస్తారు.

మరో ఆసక్తికర కథనం: ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు స్పెషల్‌గా నిలుస్తుంది, కొత్త స్కీమ్‌లతో మీ మతిపోతుంది!

టాప్ హెడ్ లైన్స్

Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
How To Check CIBIL Score In Telugu: పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సిబిల్ స్కోర్‌ ఎలా చెక్ చేసుకోవాలి?
Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget