అన్వేషించండి

CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు

Hyderabad News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

Telangana CM Revanth Reddy Davos Tour Completed: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (Shamshabad Airport) చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ ప్రశంసించారు. కాగా, దావోస్‌లో వివిధ సంస్థలతో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తాజా ఒప్పందాలతో సరికొత్త రికార్డు సృష్టించగా.. దాదాపుగా 50 వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

సరికొత్త రికార్డులు

దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీగా పెట్టుబడులు సమీకరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. మొత్తం రూ.1,78,950 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు సాగగా.. గతంతో పోలిస్తే ఈసారి మూడింతలకు మించి ఇన్వెస్ట్‌మెంట్స్ సమీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వటం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. 

ప్రముఖ సంస్థల పెట్టుబడుల వివరాలివే..

  • అమెజాన్ వెబ్ సర్వీసెస్ - రూ.60 వేల కోట్లు
  • మేఘా ఇంజినీరింగ్ సంస్థ - రూ.15 వేల కోట్లు
  • హెచ్‌సీఎల్ సంస్థ - రూ.10 వేల కోట్లు
  • జేఎస్‌డబ్ల్యూ - రూ.800 కోట్లు, విప్రో - రూ.750 కోట్లు
  • రూ.500 కోట్లతో స్కైరూట్ ఏరో స్పేస్ తయారీ, పరీక్షా కేంద్రం
  • టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందం.
  • రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ ఉర్స్ క్లస్టర్స్ ఒప్పందం.
  • రూ.7 వేల కోట్ల పెట్టుబడికి మైత్రా గ్రూప్ ఎంవోయూ.
  • అక్షత్ గ్రీన్ టెక్ - రూ.7 వేల కోట్లు
  • బ్లాక్ స్టోన్ - రూ.4,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

వీటితో పాటు ఇన్ఫోసిస్, విప్రో వంటి ప్రముఖ సంస్థలు తమ ప్రాంగణాలను పెద్దఎత్తున విస్తరించనున్నట్లు ప్రకటించాయి. ఎక్లాట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ నూతన ప్రాంగణాన్ని నెలకొల్పనుండగా.. సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంయుక్తంగా ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఆయా సంస్థల ద్వారా రాష్ట్రంలో 25,800 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణమున్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించింది. 

Also Read: Danam Nagendar: గొంతు మార్చిన ఎమ్మెల్యే దానం - మళ్లీ గోడ దూకేస్తారా?, సొంత ప్రభుత్వంపైనే విమర్శలకు కారణం ఇదేనా?

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget