Bharat Ratna Award List 2025: ఎన్టీఆర్‌కు ఈసారైనా భారతరత్న దక్కేనా? ఇంకా లిస్ట్‌లో ఎవరెవరున్నారు?
Bharat Ratna Award List: ఎన్టీఆర్‌కు ఈసారైనా భారతరత్న దక్కేనా? అని ప్రతి తెలుగు వ్యక్తి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ప్రకటించాల్సిన లిస్ట్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు.

Bharat Ratna For NTR: ఎన్టీఆర్‌కు 'భారతరత్న' ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే ప్రతిసారి అది వెనక్కిపోతూనే వస్తోంది. రాజకీయంగాను సినిమాపరంగానూ తెలుగువాడి ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఘనంగా చాటిన నందమూరి తారక రామారావుకు ' భారతరత్న' ఇచ్చి గౌరవించాలని పార్టీలు కతీతంగా ప్రతి తెలుగువాడు కోరుతున్నాడు. మరో తెలుగు దిగ్గజం పీవీ నరసింహారావుకు ఆ పురస్కారం దక్కింది. ఇక పెండింగ్లో ఉంది ఎన్టీఆర్ మాత్రమే.1999- 2004 మధ్య కేంద్రంలో టిడిపి చక్రం తిప్పినప్పుడు ఎన్టీఆర్‌కు 'భారతరత్న' సాధించడం వీలుపడి ఉండేదనీ కానీ అప్పట్లో చంద్రబాబు పెద్దగా ప్రయత్నం చేయలేదని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి అవకాశమే వచ్చింది. టిడిపి పార్టీ ప్రస్తుతం NDAలో చాలా కీలకంగా వహరిస్తోంది. కాబట్టి చంద్రబాబు తనపై ఉన్న అపప్రదను తొలగించేసుకోవడానికి ఇదే సరైన సమయం అని అందరూ భావిస్తున్నారు.
లిస్ట్‌లో రతన్ టాటా, మన్మోహన్ సింగ్
ఎన్టీఆర్‌తోపాటు మరో ఇద్దరు దిగ్గజాలకు కూడా ' భారతరత్న' ప్రకటించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. వ్యాపారంలోనూ దేశభక్తి ఉంటుందని, లాభం కంటే దేశ ప్రజలకు ప్రయోజనం కలిగించడమే లక్ష్యంగా పని చేసిన 'రతన్ టాటా (1937-2024), దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టిన ఆర్థికవేత్త, మాజీ ప్రధాని (1932-2024) ఇద్దరు గత ఏడాది మరణించారు. దేశానికి వారు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని 'భారతరత్న' పురస్కారం అందించాలని చాలా మంది కోరుతున్నారు. వారితోపాటే ఎన్టీఆర్ (1923-1996)కు కూడా 'భారతరత్న' లభిస్తుందేమో అన్న ఆశ తెలుగువారిలో ఉంది.
Also Read: మొబైల్ ఫోన్ మోడల్‌ను బట్టి క్యాబ్ కంపెనీలు ట్యాక్సీ ఛార్జీలను నిర్ణయిస్తున్నాయా?
గరిష్టంగా ముగ్గురికి ఇచ్చే అవకాశం
భారతరత్న అవార్డును ఒకే ఏడాది గరిష్టంగా ముగ్గురికి అందించవచ్చు. కానీ 2020-23 మధ్యలో ఎవ్వరికీ ఈ అవార్డును ప్రకటించలేదని చెబుతూ 2024లో ఏకంగా ఐదుగురికి భారతరత్న ప్రకటించారు. పీవీ నరసింహా రావు, LK అద్వానీ, స్వామినాథన్, కర్పూరీ ఠాకూర్, చరణ్ సింగ్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించారు. కాబట్టి ఈ ఏడాది మన్మోహన్ సింగ్, రతన్ టాటా, ఎన్టీఆర్‌లలో ఒకరికి లేదా ముగ్గురికీ కలిపి భారతరత్న ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. భారతరత్న పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రికమండేషన్ అవసరం లేదు. ప్రధానమంత్రి స్వయంగా రికమెండ్ చేయొచ్చు.
బిజెపి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బలపడే లక్ష్యంగా శ్రమిస్తోంది. గతేడాది తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చిన బిజెపి ప్రభుత్వం ఈసారి ఎన్టీఆర్‌ను కూడా అదేవిధంగా గౌరవిస్తుంది అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ప్రతి ఏడాది జనవరి 26న భారతరత్న పద్మ అవార్డుల ప్రకటన జరుగుతూ వస్తోంది. అయితే ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఉన్నందున రిపబ్లిక్ డే రోజునే ఈ ప్రకటన ఉంటుందా లేక ఫిబ్రవరిలో ప్రకటిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'
దేశానికి ఏదో ఒక రంగంలో అత్యున్నత సేవలు అందించిన వ్యక్తులకు ' భారతరత్న' పురస్కారం లభిస్తుంది. 1954లో ఈ పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించారు. మొదటి సంవత్సరం సీవీ రామన్, సర్వేపల్లి రాధాకృష్ణ, సి. రాజగోలాచారి ముగ్గురికీ ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు ఈ గౌరవం అందుకున్న వారి సంఖ్య 53. "నేతాజీ "సుభాష్ చంద్రబోస్‌కు 1992లో "భారతరత్న" ప్రకటించి తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఆయన మరణ తేదీపై నిర్దారణ లేకపోవడంతో ఆయనకు భారతరత్న ఇవ్వాలా లేదా అనే దానిపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది.
Also Read: భారత్‌లోనూ ఒక బ్లాక్ బడ్జెట్ - ఎవరు, ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

