KA Paul: పాస్‌పోర్టు ఫుల్ - సమస్యల్లో కేఏ పాల్ - కొత్తది ఇవ్వడం లేదట !
Paul passport: తన పాస్ పోర్టు రెన్యూవల్ చేయడానికి ఇండియా కాన్సులేట్ సిబ్బంది టార్చర్ పెడుతున్నారని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆయన వీడియో పోస్ట్ చేశారు.

KA Paul With No passport: కేఏ పాల్ గా ప్రసిద్ధుడయిన కిలారి ఆనందపాల్ ..తన పాస్ పోర్టు రెన్యూవల్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన పాస్ పోర్టులో పేజీలు అయిపోయాయని రెన్యూవల్ కోసం అటూ ఇటూ తిప్పుతున్నారని విమర్సించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని హ్యూస్టన్ లో ఉన్నారు. మూడు రోజుల నుంచి ఆన్ లైన్ పాస్ పోర్టు కోసం ఫిలప్ చేస్తూంటే ఎర్రర్ వస్తోందని పాల్ అంటున్నారు.
Dr. K.A Paul from Houston USA exposing Foreign Minister Jaya Shankar ‘s @DrSJaishankar mission . Passport is denied for Dr K A Paul . Total shock . Why ? Share pic.twitter.com/BSloV49ikR
— Dr KA Paul (@KAPaulOfficial) September 26, 2025
అర్జంట్ పాస్ పోర్టు కోసం ఓ ప్రాసెస్ ఉండాలి కదా అని ఆయన ప్రశ్నించారు. ఓ చోటకు వెళ్తే ఇంకో చోటకు వెళ్లమంటున్నారని ఆయన అన్నారు. సాధారణంగా పాస్ పోర్టు ప్రాసెస్ అంతా ఆన్ లైన్ లో జరుగుతుంది. లీగల్ కేసులు లేదా క్రిమినల్ చార్జెస్ ఉంటే, పాస్ పోర్టు ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఒక వ్యక్తి దేశీయంగా లేదా అంతర్జాతీయంగా సెక్యూరిటీ రిస్క్ గా భావిస్తే, ప్రభుత్వం పాస్ పోర్టు నిరాకరించవచ్చు. కొన్నిసార్లు, అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్స్ లేదా అసంపూర్ణ డాక్యుమెంటేషన్ వల్ల పాస్ పోర్టు నిరాకరణ జరుగుతుంది. ఎందుకు ఇలా పాస్ పోర్టు అధికారులు ఆయన అప్లికేషన్ తీసుకోవడం లేదో పాల్ చెప్ప లేదు.
కేఏ పాల్ గత నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. అమెరికాలో ప్రఖ్యాత ఇవాంజెలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. అక్కడే ఆయన కొన్ని మత సంస్థలు నడుపుతున్నారు. ఆయన అమెరికన్ సిటిజన్ గా మారి ఉంటారని.. ఆయనకు అమెరికా పాస్ పోర్ట్ ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో పాల్ గత కొంత కాలం నుంచి ఇండియాలో ఎక్కువగా ఉంటున్నారు . రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆయన శాశ్వతనివాసం మాత్రం అమెరికానే.
మరో వైపు ఆయనపై ఇటీవల హైదరాబాద్ లో ఏ కేసు నమోదు అయింది. పాల్ ఆఫీసులో పని చేసే మహిళను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలపై కేసులు పెట్టారు. ఆ మహిళ వాట్సాప్ చాట్స్ ను చూపించి కేసు పెట్టింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాను జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని అందుకే.. తనపై కేసులు పెడుతున్నారని ఆయన అంటున్నారు . ఇప్పుడు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల కోసమే ఆయన ఇండియాకు వద్దామనుకుంటున్నరేమో కానీ.. పాస్ పోర్టు సమస్య రావడంతో రాలేకపోతున్నారు. అసలు పాస్ పోర్టును ఎందుకు నిరాకిస్తున్నారో ఆయన చెప్పడం లేదు. అది చెబితే ఆయనకు మళ్లీ పాస్ పోర్టు రెన్యూవల్ చేస్తారో లేదో క్లారిటీ వస్తుంది.





















