అన్వేషించండి

Balakrishna in AP Assembly: ఏపీ అసెంబ్లీలో చిరంజీవి ప్రస్తావన- బాలకృష్ణ సీరియస్- జరిగిందేమిటంటే ?

MLA Kamineni: ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని చిరంజీవి ప్రస్తావన తెచ్చారు. బాలకృష్ణ సీరియస్ అయ్యారు. సినీ బృందం జగన్ ను కలిసిన సందర్భంపై చర్చలో ఇది జరిగింది.

Balakrishna Vs MLA Kamineni: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన వేధింపుల విషయంపై చర్చ జరిగింది. సినీ హీరోలు అందరూ గతంలో తాడేపల్లికి వచ్చి జగన్ ను కలిశారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలను బీజేపీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ వివరించారు. చిరంజీవి నేతృత్వంలో హీరోలు అందరూ తాడేపల్లికి వచ్చినప్పుడు జగన్ సమావేశానికి రాలేదని...సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడాలని సూచించారు. దీనిపై చిరంజీవి తాను అందర్నీ తీసుకు వస్తే సీఎం రాకపోవడం ఏమిటని గట్టిగా నిలదీస్తే అప్పుడు  వచ్చి మాట్లాడారని అన్నారు.      

జగన్ ను చిరంజీవి గట్టిగా నిలదీశారన్న కామినేని 

అయితే కామినేని మాటల్ని నందమూరి బాలకృష్ణ ఖండించారు. ఎవరూ గట్టిగా జగన్ ను నిలదీయలేదన్నారు. హీరోలు అందరూ వెళ్లిన సమయంలో.. ఆ సైకో సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలన్నారు. చిరంజీవిని అవమానించిన మాట నిజమేనన్నారు. అదే సమయంలో బాలకృష్ణ కూటమి ప్రభుత్వం తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఎఫ్‌డీసీ సమావేశంలో తన పేరును తొమ్మిదో స్థానంలో పెట్టారన్నారు.  తాను ఈ విషయంపై వెంటనే కందుర దుర్గేష్‌తోనూ మాట్లాడానన్నారు.                

ఎవరూ గట్టిగా నిలదీయలేదని చెప్పిన బాలకృష్ణ               

చిరంజీవి .. జగన్ ను నిలదీశారని ఎమ్మెల్యే కామినేని చెప్పడం బాలకృష్ణకు నచ్చకపోవడంతో ఆయన మధ్యలో కల్పించుకుని దాన్ని ఖండించినట్లుగా తెలుస్తోంది. ఎవరూ నిలదీయలేదని బాలకృష్ణ చెప్పడం ద్వారా.. జగన్ ను గతంలో చిరంజీవి నిలదీశారన్న హీరోయిజాన్ని చిరంజీవి ఆపాదించడం.. బాలకృష్ణకు ఇష్టం లేకపోయిందని అందుకే ఆయన ఖండించారని అంటున్నారు. నిజానికి అలా వెళ్లిన హీరోల బృందంలో బాలకృష్ణ లేరు. అయినా అక్కడేం జరిగిందో ఇతర హీరోల ద్వారా లేదా.. ఇతర సోర్సుల ద్వారా తెలిసిందేమో కానీ.. కామినేని చెప్పినట్లుగా జరగలేదని ఖండించారు.                 

చిరంజీవిని జగన్ అవమానించిన మాట నిజమన్న బాలకృష్ణ                 

నిజానికి ఇది ఖండించాల్సినంత విషయం కాదు. నిజంగా అక్కడ అంత మంది హీరోలు వచ్చినప్పటికీ జగన్ కలవడానికి ఇష్టపడకపోవడం.. ఆహ్వానించి.. అపాయింట్ మెంట్ ఇచ్చిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాలనడం వారందర్నీ అవమానించడమే. అసలు హీరోలను ఇంటిలోపలికి కూడా రానివ్వలేదు. వారి కార్లను రోడ్  బయటనే ఆపించి.. సెక్యూరిటీ ద్వారా చెక్ చేయించి లోపలికి పంపించారు. దానిపైనా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన సమావేశ వీడియోను విడుదల చేసినప్పుడు చిరంజీవిని దారుణంగా అవమానించారన్న ఆరోపణలు వచ్చాయి. అంత వరకూ బయట ప్రపంచానికి తెలుసు. అయితే హీరోలను కలిసేందుకు జగన్ రాలేదని.. చిరంజీవి ప్రత్యేకంగా అడగడంతోనే ఆయన వచ్చిటన్లుగా ఇప్పుడు బయటకు రావడం సంచలనం అయింది.  చిరంజీవి గట్టిగా అడిగారని కామినేని.. అడగలేదని బాలకృష్ణ చెప్పడం .. కొత్త వివాదానికి కారణం అయింది. 

టాప్ హెడ్ లైన్స్

Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget