CBI Enquiry On Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ సమాచార సేకరణ- విచారణ డ్యూటీ ఎక్కిన దర్యాప్తు సంస్థ
CBI Enquiry On Kaleshwaram Project : కాళేేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణకు సీబీఐ రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరిస్తోంది.

CBI Enquiry On Kaleshwaram Project : తెలంగాణలో రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు మరోసారి హాట్ డిబేట్‌గా మారబోతోంది. ప్రాజెక్టులో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ కేసులో కీలకంగా భావించే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, ఇతర వివరాలను తెప్పించుకుంటోంది. ఆలస్యమవుతుందని అనుకున్న విచారణ ఇప్పుడు వేగం పుంజుకునే అవకాశం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా చాలా రాజకీయాలు జరిగాయి. ఇందులో పిల్లర్లు కుంగిపోవడంతో ఆ రాజకీయాలు పీక్స్‌కు చేరాయి. దీనిపై వస్తున్న ఆరోపణల్లో ఉన్న వాస్తలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ వేసింది. ఆయన సుదీర్ంగా విచారణ చేశారు. ఇందులో కీలకంగా ఉన్న వారందర్నీ విచారించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, హరీష్‌రావును కూడా విచారించారు.
కమిషన్ అడిగిన ప్రశ్నలు, వాళ్లు ఇచ్చిన సమాచారంతో తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ మంత్రివర్గంలో తీవ్రంగా చర్చించారు. అనంతరం దీనిలో ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీబీఐకి సమాచారం చేరవేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసును టేకప్ చేసిన సీబీఐ దర్యాప్తుకు ఓకే చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి, పీసీ ఘోష్ కమిషన్ నుంచి వివరాలు సేకరిస్తోంది.
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి అనేక వివాదాలు అలుముకున్నాయి. కోర్టుల చుట్టూ తిరిగాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అన్నింటినీ చెక్ పెట్టే ప్రయత్నాల్లో విచారణ దశకు వెళ్లింది. ఈ విచార దశకు వెళ్లే క్రమంలో కూడా కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. ఈ కాళేశ్వరంపై ప్రభుత్వం వేసిన ఏక సభ్య కమిషన్ పీసీ ఘోష్ కమిషన్‌కు చట్టబద్ధత లేదని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.దాన్ని కోర్టు కొట్టేసింది. తర్వాత కమిషన్ రిపోర్డు బహిర్గతం చేయొద్దని కూడా పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వానికి కోర్టు కొన్ని సూచనలు చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు ఇంత వరకు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏముందో బయటకు రాలేదు. అయినా ఇంతలో కేసుకు వెళ్లింది. ఇది ఎవరూ ఊహించలేదు. కానీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో కేసు మరో మలుపులు తిరిగింది. అయితే నివేదికలోని కొన్ని విషయాలపై ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ఎక్కడా అధికారికంగా ఎలాంటి వివరాలు అందించకపోయినా నివేదికలో ఏముందో తెలిసింది. అసెంబ్లీలో కూాడా చర్చకు పెట్టింది. వాటి ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈ కేసు విచారణ బాధ్యతను తీసుకున్న సీబీఐ రంగంలోకి దిగింది. తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో ఉంది.





















