Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య- సునీత పేరు ఖరారు చేసిన కేసీఆర్
Jubilee Hills by-election: తెలంగాణలో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని బీఆర్‌ఎస్ ప్రకటించింది. అనారోగ్యంతో చనిపోయిన మాగంటిగోపీనాథ్ భార్య సునీతను బరిలో దింపనుంది.

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యత ఇచ్చినట్టు బీఆర్‌ఎస్ అధినేత ప్రకటించారు.
చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థనేతగా, వారి నిబద్ధతను పరిశీలించామని కేసీఆర్ పేరుతో వచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. అన్నింటిని గమనించి మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తున్నాన్నారు. అందుకే జూబ్లీ హిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.





















