Jammu Kashmir Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు కూలీలు మృతి
జమ్ముకశ్మీర్ కుల్గాంలోని వాన్‌సో ప్రాంతంలో కూలీలపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి.
జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కుల్గాంలోని వాన్‌పో ప్రాంతంలో స్థానికేతర కూలీలపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల జాడ కోసం తనిఖీలు చేపట్టాయి.
Terrorists fired indiscriminately upon non-local labourers at Wanpoh area of Kulgam. In this terror incident, 2 non-locals were killed and 1 injured. Police & Security Forces cordoned off the area. Details awaited: J&K Police pic.twitter.com/nLBU6PSzlm
— ANI (@ANI) October 17, 2021
J&K: Two non-Kashmiri labourers, all of them being residents of Bihar, killed and one injured after being fired upon by terrorists at Wanpoh area of Kulgam. Police & Security Forces cordoned off the area.
— ANI (@ANI) October 17, 2021
Visuals from the spot.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/t7QSrKTqJz
ఏం జరిగింది?
కుల్గాంలోని వాన్‌పో ప్రాంతంలో కూలీలు అద్దెకు ఉంటున్న ఇళ్లలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. మృతి చెందిన కూలీలను రాజా రేశీ, జోగిందర్ రేశీ దేవ్‌గా అధికారులు గుర్తించారు. వీరిద్దరూ బిహార్‌కు చెందినవారని తెలిపారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అతని భుజం, వెన్నుకు గాయాలైనట్లు సమాచారం.
వరుస దాడులు..
జమ్ముకశ్మీర్‌లో కశ్మీరేతులపై వరుస దాడులు జరుగుతున్నాయి. 24 గంటలు గడవకముందే ఇది మూడో దాడి కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అధికారులు మాత్రం ఉగ్రవాదులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని స్పష్టం చేస్తున్నారు. అయితే మరోవైపు ఉగ్రవాదులను బలగాలు ఏరిపారేస్తున్నాయి.
పుల్వామా జిల్లా అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన టాప్ కమాండర్ షామ్ సోఫీని బలగాలు మట్టుబెట్టాయి.
పండుగలు రానున్న వేళ దిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులు చేసేందుకు కుట్ర పన్నిన వివిధ తీవ్రవాద గ్రూపులకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇటీవల అదుపులోకి తీసుకుంది.
శ్రీనగర్, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఏకకాలంలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 21 మంది మృతి
Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్
Also Read: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య