Gaza: ఇజ్రాయేల్‌పై బిగ్ మిజైల్‌ని ప్రయోగించిన హమాస్, ఉలిక్కిపడ్డ టెల్ అవీవ్ - యుద్ధం మరింత తీవ్రం!
Israel Hamas War: ఇజ్రాయేల్ రాజధాని టెల్ అవీవ్‌పై హమాస్ బిగ్ మిజైల్‌తో దాడి చేసినట్టు సంచలన ప్రకటించింది.
Israel Hamas Conflict: ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం (Israel Hamas War) ఇంకా తీవ్రతరమవుతోంది. ఇజ్రాయేల్‌పై పైచేయి సాధించామని హమాస్ చేసిన ప్రకటనను ఇజ్రాయేల్ సైన్యం ఖండించింది. అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పింది. ఈ ప్రకటన వచ్చిన మరుసటి రోజే హమాస్ అతి పెద్ద మిజైల్‌ని ఇజ్రాయేల్‌పై ప్రయోగించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సైన్యం పలు చోట్ల సైరన్‌లు మోగించింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు హమాస్ అనుబంధ సంస్థ అయిన al-Qassam Brigades ఓ ప్రకటన చేసింది. తమ పౌరులపై దాడులు చేసి చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పింది. ఆ దాడులకు బదులుగానే మిజైల్‌ని లాంఛ్ చేసినట్టు వెల్లడించింది. గాజా స్ట్రిప్ (Gaza News) నుంచి ఈ మిజైల్‌ని ప్రయోగించినట్టు స్పష్టం చేసింది. టెల్ అవీవ్‌లో గత నాలుగు నెలలుగా సైరన్‌ల మోతలు ఏమీ వినిపించలేదు. ఇప్పుడీ మిజైల్ దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటి వరకూ ఎక్కడా ప్రాణనష్టం నమోదు కాలేదని Israel Defence Forces చెబుతోంది.
8 రాకెట్‌ల లాంఛింగ్..
BBC వెల్లడించిన వివరాల ప్రకారం రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం 8 రాకెట్స్‌ని లాంఛ్ చేసింది. వాటిలో కొన్నింటిని ఇజ్రాయేల్ మిలిటరీ నేల కూల్చింది. హమాస్ దాడులతో కొన్ని చోట్ల IDF ప్రజల్ని అప్రమత్తం చేసింది. సైరన్స్ మోగిస్తోంది. ఇజ్రాయేల్ నుంచి గాజాకి సరుకులతో పాటు వైద్యం అందించేందుకు అవసరమైన సామగ్రిని తరలించారు. ఇజ్రాయేల్, హమాస్‌కి మధ్య ఈ మేరకు డీల్ కూడా కుదిరింది. కానీ అంతలోనే హమాస్ మిజైల్స్‌తో విరుచుకుపడింది. అటు ఇజ్రాయేల్ సైతం రఫా ప్రాంతంపై దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఐదుగురు పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక వైద్యులు వెల్లడించారు. పౌరుల ప్రాణాలు తీయడం తమ లక్ష్యం కాదని, రఫాలో దాక్కున్న హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేయాలన్నదే తమ టార్గెట్ అని ఇజ్రాయేల్ స్పష్టం చేసింది. అయితే...మానవతా సాయం అందించకుండా యుద్ధం కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం...36వేల మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడి చేశారు. అప్పుడు మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయేల్ పౌరుల్ని హమాస్ బంధించింది. వాళ్లని వదిలిపెట్టేందుకు రకరకాల కండీషన్స్ పెడుతోంది.
హమాస్ వార్నింగ్..
దాడుల్ని ఇంకా తీవ్రతరం చేసే సామర్థ్యం తమకు ఉందని హమాస్ తేల్చి చెప్పింది. ఇజ్రాయేల్ మిలిటరీ దాడులు ఆపేంత వరకూ యుద్దం కొనసాగుతుందని వెల్లడించింది. రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. హమాస్ చెరలో ఉన్న శరణార్థులను విడిపించేందుకు ఇజ్రాయేల్ ఎప్పటికప్పుడు డీల్ కోసం చర్చలు జరుపుతోంది. అటు ఒప్పందాలు కుదురుతున్నా మరో వైపు విధ్వంసం జరుగుతోంది.