![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amit Shah: అంబేడ్కర్ కూడా యూసీసీని సపోర్ట్ చేశారు, వచ్చే ఐదేళ్లలో అమలు చేస్తాం - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah: వచ్చే ఐదేళ్లలో కచ్చితంగా యూసీసీతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నికను అమలు చేసి తీరతామని కేంద్రహోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు.
![Amit Shah: అంబేడ్కర్ కూడా యూసీసీని సపోర్ట్ చేశారు, వచ్చే ఐదేళ్లలో అమలు చేస్తాం - అమిత్ షా కీలక వ్యాఖ్యలు UCC To Be Implemented In Next Term Says Home Minister Amit Shah Amit Shah: అంబేడ్కర్ కూడా యూసీసీని సపోర్ట్ చేశారు, వచ్చే ఐదేళ్లలో అమలు చేస్తాం - అమిత్ షా కీలక వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/737cdaa1ce06ae59d9739c64bdae5a311716725641503517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amit Shah on UCC: కేంద్ర హోం మంత్రి అమిత్ షా యూసీసీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో ఈ రెండింటినీ తప్పకుండా అమలు చేస్తామని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా యునిఫామ్ సివిల్ కోడ్‌ని (Uniform Civil Code) అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. నిపుణులతో చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. PTI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తే One Nation One Election కూడా అమల్లోకి తెస్తామని అన్నారు. తద్వారా ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సారి ఎన్నికలు విపరీతమైన ఎండల్లో జరుగుతున్నాయి. పలు చోట్ల వడగాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా ఎంతో కొంత పోలింగ్ శాతంపై ప్రభావం పడుతుందన్న వాదన వినిపిస్తోంది. అటు ఎన్నికల అధికారులు మాత్రం పోలింగ్ బూత్‌ల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే...ఇకపై ఎన్నికల్ని ఎండాకాలంలో కాకుండా వేరే రోజుల్లో నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. దీనిపైనా అమిత్ షా స్పందించారు. కచ్చితంగా ఈ అంశంపై ఆలోచన చేస్తామని, ఓ సారి ఎన్నికల్ని ప్రీపోన్ చేస్తే అది సాధ్యమవుతుందని వివరించారు. కాల క్రమేణా ఎన్నికలు ఎండాకాలంలో నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇగే సమయంలో యూసీసీ గురించీ ప్రస్తావించారు.
"యూసీసీ అమలు చేయాల్సిన బాధ్యత మాపైనే ఉంది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. అప్పట్లో కే ఎమ్ మున్షీ, రాజేంద్ర బాబుతో పాటు అంబేడ్కర్ లాంటి మేధావులంతా కలిసి దీనిపై చర్చించారు. మతం ఆధారంగా భారత్‌లో ఎలాంటి చట్టాలు ఉండకూడదని అప్పట్లోనే వాళ్లు వాదించారు. యూసీసీ ఉండాలని ప్రతిపాదించారు"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
వన్ నేషన్ వన్ ఎలక్షన్..
ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసినట్టు అమిత్ షా గుర్తు చేశారు. 1950 నుంచి బీజేపీ అజెండాలో యూసీసీ ప్రస్తావన ఉంది. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చి అమలు చేయాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. దీనిపై కాస్త భారీగానే డిబేట్ అవసరం అని అమిత్ షా అభిప్రాయపడ్డారు. దీనిపై న్యాయపరమైన చిక్కులూ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇక ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాల్సిన సమయం వచ్చేసిందని వెల్లడించారు. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు చెప్పారు.
"ప్రధాని నరేంద్ర మోదీ రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. నేను కూడా ఆ కమిటీలో ఉన్నాను. ఇప్పటికే నివేదిక కూడా సబ్మిట్ చేశాం. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం వచ్చేసింది. కచ్చితంగా వచ్చే ఐదేళ్లలో ఇది అమలు చేస్తాం. అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేసి తీరతాం"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
Also Read: Papua New Guinea: పపువా న్యూ గినియాలో విరిగి పడుతున్న కొండ చరియలు, మట్టిలో కూరుకుపోయి 670 మంది మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)