Wrestlers Protest: సమస్యలు తీరితేనే ఏషియన్ గేమ్స్‌లో ఆడతాం, మానసికంగా కుంగిపోయాం - సాక్షి మాలిక్
Wrestlers Protest: తమ సమస్యలు పరిష్కారమయ్యాకే ఏషియన్ గేమ్స్‌లో ఆడతామని సాక్షి మాలిక్ స్పష్టం చేశారు.
Wrestlers Protest:
ఏషియన్ గేమ్స్‌పై క్లారిటీ
కేంద్రంతో చర్చలు జరుగుతున్న తరుణంలో రెజ్లర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. Asian Gamesలో ఆడతారా లేదా అన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చింది రెజ్లర్ సాక్షి మాలిక్. సోనిపట్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె...ప్రస్తుత సమస్య పరిష్కారం అయ్యాకే ఆ గేమ్స్‌లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. తాము ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నామో ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 15లోగా బ్రిజ్ భూషణ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
"మా డిమాండ్‌లు తీర్చినప్పుడు, సమస్యలు పరిష్కారమైనప్పుడే ఏషియన్ గేమ్స్‌లో ఆడతాం. రోజూ మేము ఎంత మానసిక వేదనకు గురవుతున్నామో ఎవరికీ అర్థం కావడం లేదు"
- సాక్షి మాలిక్, రెజ్లర్
#WATCH | "We will participate in Asian Games only when all these issues will be resolved. You can't understand what we're going through mentally each day": Wrestler Sakshee Malikkh in Sonipat pic.twitter.com/yozpRnYQG9
— ANI (@ANI) June 10, 2023
బ్రిజ్ భూషణ్ ఇంటికి సంగీత ఫోగట్..
అంతకు ముందు రోజు రెజ్లర్ సంగీత ఫోగట్ బ్రిజ్ భూషణ్ ఇంటికి వెళ్లడం ఉత్కంఠ రేపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆమెని "రీకన్స్ట్రక్షన్" కోసం పిలిచారు పోలీసులు. బ్రిజ్ భూషణ్ ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాడు అని వివరించాలని అడిగారు. ఆమెతో పాటు మహిళా పోలీసులు వెళ్లారు. ఢిల్లీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి మధ్యాహ్నం వెళ్లిన సంగీత ఫోగట్ దాదాపు అరగంట తరవాత బయటకు వచ్చారు. ఇప్పటికే కేంద్రం ఈ ఆరోపణలను విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని నియమించింది. వచ్చే వారం నాటికి తమ రిపోర్ట్‌ని కోర్టులో సమర్పించనుంది. ఇప్పటికే సిట్ 180 మందిని ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. దాదాపు నెల రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తూనే ఉన్నారు. రెజ్లర్లు మాత్రమే కాదు. బ్రిజ్ భూషణ్‌పై ఇంటర్నేషనల్ రెఫరీ జగ్బీర్ కూడా ఆరోపణలు చేశారు. మైనర్ రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించడం తన కళ్లారా చూశానని చెప్పారు.
"WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించడం నేను చూశాను. మద్యం మత్తులో ఇదంతా చేశాడు. 2013లో మేం థాయ్‌లాండ్‌కి వెళ్లాం. అప్పుడే తొలిసారి బ్రిజ్ భూషణ్ అసలు స్వరూపం బయపడింది"
- జగ్బీర్,ఇంటర్నేషనల్ రెఫరీ
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, సాక్షిమాలిక్ భేటీ అయ్యారు. తమ డిమాండ్‌లనూ వినిపించారు. మొత్తం 4 డిమాండ్‌లు వినిపించిన రెజ్లర్లు...రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కి మహిళా చీఫ్‌ని నియమించాలని కోరారు. తమపై పోలీసులు నమోదు చేసిన FIRలను విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిజ్ భూషణ్‌పై విచారణ జరిపి ఆయనను అరెస్ట్ చేయాలని తేల్చి చెప్పారు. ఓ మైనర్ రెజ్లర్‌ని కూడా ఆయన లైంగికంగా వేధించారని ఆరోపించారు రెజ్లర్లు. అంతే కాదు. రెజ్లింగ్ ఫెడరేషన్‌లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, మహిళను చీఫ్‌గా నియమిస్తే సమస్యలు తీరిపోతాయని అనురాగ్ ఠాకూర్‌కి వివరించినట్టు తెలుస్తోంది.
Also Read: కాంగ్రెస్ సంచలన నిర్ణయం! స్కూల్ సిలబస్ నుంచి RSS వ్యవస్థాపకుడి పాఠం తొలగింపు?