Moon Drifting Away From Earth: దూరమవుతున్న చందమామ, కొన్నేళ్ల తరువాత కనిపించడేమో!
Moon Drifting Away From Earth: భూభ్రమణ శక్తి కారణంగా చంద్రుడు మనకు క్రమంగా దూరంగా వెళ్తున్నాడు. ప్రతి సంవత్సరం 3.78 సెంటీమీటర్ల మేర దూరం వెళ్తున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
Moon Drifting Away From Earth: ఇండియా ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి నేలపైన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అయింది. 40 రోజుల ప్రయాణం తరువాత విక్రం ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపింది. ఈ దృశ్యాన్ని కోట్లాది మంది టీవీలు, సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఆనందంతో సంబరపడిపోయాయి. అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు. నాలుగేళ్ల పాటు కష్టపడిన శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో సౌత్ పోల్ ను తాకిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది.
ఇంతటి శుభసందర్భంలో మీరు ఒక వాస్తవం, చేదు వార్త గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుత లెక్కల ప్రకారం చంద్రుడు భూమికి 3,84,400 కి.మీ దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి 2,70,000 కి.మీ దూరంలో ఉండేవాడని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఇప్పుడున్న దూరం కంటే 70% దగ్గరగా ఉండేవాడని ఆ అధ్యయనం తెలిపింది. చందమామ ఏర్పడినప్పుడు నేటితో పోలిస్తే 10 రెట్లు దగ్గరగా ఉండేదట. ఆ తర్వాత భూభ్రమణ శక్తి కారణంగా చంద్రుడు మనకు క్రమంగా దూరంగా వెళ్తున్నాడు.
ప్రతి సంవత్సరం 3.78 సెంటీమీటర్ల మేర దూరం వెళ్తున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం చంద్రుడు అదే వేగంతో భూమి నుంచి దూరంగా వెళ్తూ ఉంటే దాదాపు 1.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిని ఢీకొట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. చంద్రుడు భూమికి దూరంగా వెళ్లడం ద్వారా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత భూమి మీదున్నవాళ్లు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడలేరు. భూభ్రమణం కారణంగా చంద్రుడు భూమికి దూరంగా వెళ్తుున్నాడని, క్రమంగా దూరంగా వెళ్తున్నాడు. భూ భ్రమణం కక్ష్యలో చిన్న పాటి వంపుల కారణంగా భూమిపై పడుతున్న సూర్యకాంతి పరిమాణంపై ప్రభావం ఉంటోందట. ఈ భూభ్రమణాలు వాటి పౌనఃపున్యాలు చంద్రుడు, భూమి మధ్య దూరాన్ని కూడా నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2.46 బిలియన్ సంవత్సరాల క్రితం భూమికి చంద్రుడు ప్రస్తుతం ఉన్న దూరం కంటే 60,000 కి.మీ దగ్గరగా ఉండేదట.
గన్‌పౌడర్ వాసన వచ్చిన చంద్రుడి మట్టి
భూమి నుంచి చూస్తే చంద్రుడు కాంతివంతంగా తెల్లగా కనిపిస్తాడు. కానీ వాస్తవానికి చంద్రుడు తెలుపు రంగులో ఉండడు. చంద్రుడిని దగ్గరగా చూసినప్పుడు, అది ముదురు బూడిద రంగులో ఉంటుంది. సూర్యుడి కాంతి చంద్రుడిపై పడి తెల్లగా వెలుగుతూ కనిపిస్తాడు. అంతేకాదు చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. వెలుతురును సృష్టించ లేడు. చంద్రుడిపై మీద కాలుమోపిన వ్యోమగాములు ఆసక్తికర విషయాలు తెలిపారు. జాబిల్లి మట్టి గన్‌పౌడర్ వాసన వస్తోందని చెప్పారు. వారి స్పేస్‌సూట్‌ల నిండా అదే ధూళి ఉందని చెప్పారు. ఆ దుమ్ము కారణంగా కొందరు వ్యోమగాములకు భూమికి తిరిగొచ్చాక లూనార్ ఫీవర్ వచ్చింది. దీనివల్ల వారికి తుమ్ములు, గొంతు పట్టేయడం వంటివి సమస్యలతో బాధపడ్డారు.
The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి