అన్వేషించండి

Viral Video: వందేభారత్ ట్రైన్‌లో హలాల్ టీ సర్వ్ చేశారని ప్యాసింజర్ ఆగ్రహం, స్టాఫ్‌తో వాగ్వాదం - వైరల్ వీడియో

Viral Video: వందేభారత్‌ రైల్లో ఓ ప్యాసింజర్‌కి హలాల్ టీ సర్వ్ చేయడంపై తీవ్ర వాగ్వాదం జరిగింది.

Viral Video: 

హలాల్‌ టీ అంటూ ఆరోపణ..

వందేభారత్ రైల్లో హలాల్‌ టీ సర్వ్ చేయడంపై ఓ ప్యాసింజర్‌ రైల్వే సిబ్బందితో గొడవ పడిన వీడియో వైరల్ అవుతోంది. హలాల్ సర్టిఫైడ్ టీ ఇచ్చినందుకు అసహనం వ్యక్తం చేసిన ప్యాసింర్ సిబ్బందిని నిలదీశాడు. శ్రావణమాసంలో ఇలాంటివి ఎలా సర్వ్ చేస్తారమని మండి పడ్డాడు. అయితే..రైల్వే సిబ్బంది మాత్రం ఆ ప్యాసింజర్‌కి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అది పూర్తిగా వెజిటేరియన్‌ ప్రొడక్ట్ అని వివరించారు. "శ్రావణ మాసంలో హలాల్ సర్టిఫైడ్‌ టీ ఇస్తారా.." అని ప్యాసింజర్ ప్రశ్నించగా అందుకు రైల్వే సిబ్బంది "అంటే ఏంటి" అని అడిగాడు. "మీకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. హలాల్ సర్టిఫైడ్ అంటే ఏంటో చెప్పండి. అందరూ ఇది తెలుసుకోవాలి. మనకు ISI సర్టిఫికేట్ ఏంటో తెలుసు. హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటో కూడా చెప్పండి" అని ప్రయాణికుడు నిలదీశాడు. అందుకు రైల్వే ఉద్యోగి "ఇది మసాలా టీ సాచెట్. ఇది పూర్తిగా వెజిటేరియన్‌ ప్రొడక్ట్" అని వివరించాడు. "మీరు అనవసరంగా వీడియో తీస్తున్నారు. ఛాయ్‌ అనేది వెజిటేరియన్‌ సర్" అని అసహనం వ్యక్తం చేశాడు రైల్వే ఉద్యోగి.  

వైరల్ అయిన వీడియో..

ఆ తరవాత ప్యాసింజర్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. "నాకు ఎలాంటి సర్టిఫికేషన్‌లు అవసరం లేదు. అలా అనుకుంటే స్వస్తిక్ ముద్ర వేయండి" అని డిమాండ్ చేశారు. కచ్చితంగా ఆలోచిస్తామని రైల్వే ఉద్యోగి సమాధానమిచ్చాడు. ఇలా చాలా సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై మిగతా ప్రయాణికులు కూడా అభ్యంతరం వ్యక్తంచేశారు. టీ సాచెట్స్‌కి కూడా హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ప్యాసింజర్‌ని సపోర్ట్ చేయగా..మరి కొందరు రైల్వే ఉద్యోగికి సపోర్టింగ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ప్యాసింజర్ అంతలా నిలదీస్తున్నా..ఏ మాత్రం అసహనానికి గురి కాకుండా చాలా ఓపిగ్గా మాట్లాడాడని ప్రశంసిస్తున్నారు. 

హలాల్ అంటే..? 

హలాల్ అనే పదం.. అరబ్బీ నుంచి వచ్చింది. హలాల్ అంటే ధర్మబద్ధమైనది లేదా అనుమతించదగినదని అర్థం. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు అంతా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఆహార పదార్థాల వాణిజ్య మార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా. హలాల్‌కు వ్యతిరేక పదం హరామ్. దీనికి నిషేధించినది, అధర్మమైనది, అనైతికమైనది అని అర్థం ఉంది. ఆహార పదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సంప్రదాయం ముస్లింలలో ఉంది. జంతువుల మాంసాలను, హలాల్ చేసిన తరువాత మాత్రమే తినాలని వారు నమ్ముతారు.

Also Read: నిండా పదేళ్లు లేవు, కానీ 50 దేశాలు చుట్టొచ్చింది - ఒక్క రోజు కూడా స్కూల్ ఎగ్గొట్టలేదు

టాప్ హెడ్ లైన్స్

Kumbh Mela Viral Girl Case: తండ్రిపైనే ఫోర్జరీ, కిడ్నాప్ కేసు పెట్టిన కుంభమేళా వైరల్ గర్ల్ - ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
తండ్రిపైనే ఫోర్జరీ, కిడ్నాప్ కేసు పెట్టిన కుంభమేళా వైరల్ గర్ల్ - ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
DMK MLA Markandeyan Arrest: విజయ్‌పై అనుచితంగా మాట్లాడితే అరెస్టే - జైలుకెళ్లిన రెండో డీఎంకే ఎమ్మెల్యే - స్టాలిన్ ఫైర్
విజయ్‌పై అనుచితంగా మాట్లాడితే అరెస్టే - జైలుకెళ్లిన రెండో డీఎంకే ఎమ్మెల్యే - స్టాలిన్ ఫైర్
Delhi Parliament CJP Protest: ఢిల్లీలో రణరంగం - పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం.. అమిత్ షాతో ప్రధాన్ ఎమర్జెన్సీ మీటింగ్ !
ఢిల్లీలో రణరంగం - పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం.. అమిత్ షాతో ప్రధాన్ ఎమర్జెన్సీ మీటింగ్ !
Tripura DGP Suicide:డీజీపీ అనుమానాస్పద మృతి - కార్యాలయంలోనే కాల్చుకుని ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్?
డీజీపీ అనుమానాస్పద మృతి - కార్యాలయంలోనే కాల్చుకుని ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget